Asianet News TeluguAsianet News Telugu

పొత్తు చర్చలపై ట్విస్టిచ్చిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి

పొత్తుల విషయంలో తమకు ముందే చెప్పాలని పార్టీ నేతలు కొందరు పీసీసీచీఫ్  ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచించారు. పొత్తులపైనే  ఈ సమావేశంలోనే ఎక్కువగా చర్చించారు.
 

Congress key leders meeting at gandhibhavan in hyderabad
Author
Hyderabad, First Published Sep 7, 2018, 2:28 PM IST


హైదరాబాద్: పొత్తుల విషయంలో తమకు ముందే చెప్పాలని పార్టీ నేతలు కొందరు పీసీసీచీఫ్  ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచించారు. పొత్తులపైనే  ఈ సమావేశంలోనే ఎక్కువగా చర్చించారు.

కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత   ఎన్నికల వేడి రాజుకొంది.దీంతో కాంగ్రెస్ పార్టీ అత్యవసరంగా సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా పొత్తుల విషయమై  పార్టీ నేతల మధ్య చర్చ జరిగినట్టు  తెలుస్తోంది.

అయితే ఏ పార్టీతో కూడ పొత్తుల  విషయమై ఇంకా చర్చించలేదని  కాంగ్రెస్ పార్టీ  తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు  ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.  
అయితే  పొత్తులుంటే మాత్రం ముందే తమకు చెప్పాలని  కాంగ్రెస్ పార్టీ నేతలు  ఉత్తమ్ దృష్టికి తీసుకెళ్లారు.

 ఏ పార్టీతో పొత్తు పెట్టుకొన్నా.. ఆయా అసెంబ్లీ ఇంచార్జీలతో  చర్చించాలని కాంగ్రెస్ నేతలు సూచించారు.  అంతేకాదు టిక్కెట్టు  కేటాయింపు విషయంలో కూడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీలను ఒప్పించిన తర్వాతే  ఇతర  పార్టీలకు సీట్లను కేటాయించాలని కూడ  కొందరు నేతలు ఈ సమావేశంలో సూచించారు.

మరోవైపు  ఈ నెల 11వ తేదీన రాహుల్ గాంధీ న్యూఢిల్లీకి వస్తారు. రాహుల్ ఢిల్లీకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఎన్నికల వ్యూహంపై కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు చర్చించనున్నారు. ఎన్నికలు కూడ  త్వరలోనే వచ్చే అవకాశం ఉన్నందున  పొత్తులు... సీట్ల కేటాయింపు తదితర విషయాలపై  కాంగ్రెస్ నేతలు రాహుల్ తో చర్చించాలని భావిస్తున్నారు.

ఈ వార్తలు చదవండి

కేసీఆర్ ఎఫెక్ట్: వారంలో 50 మంది అభ్యర్థులను ప్రకటించనున్న కాంగ్రెస్

టీడీపీతో కాంగ్రెస్ పొత్తు చర్చలు: కమిటీలో రేవంత్ రెడ్డి అందుకే

కాంగ్రెస్‌కు షాక్: టీఆర్ఎస్‌లోకి మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి?

Follow Us:
Download App:
  • android
  • ios