Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్‌కు షాక్: టీఆర్ఎస్‌లోకి మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి?

మాజీ స్పీకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత  కే.ఆర్. సురేష్ రెడ్డితో  మాజీ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. సురేష్ రెడ్డి టీఆర్ఎస్ లోకి వెళ్లే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

Former speaker suresh reddy likely to join in Trs
Author
Hyderabad, First Published Sep 7, 2018, 11:32 AM IST


హైదరాబాద్: మాజీ స్పీకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత  కే.ఆర్. సురేష్ రెడ్డితో  మాజీ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. సురేష్ రెడ్డి టీఆర్ఎస్ లోకి వెళ్లే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

శుక్రవారం నాడు మాజీ స్పీకర్ కే.ఆర్. సురేష్ రెడ్డితో  కేటీఆర్ సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఆరుగురు నేతలు కూడ టీఆర్ఎస్ లో చేరేందుకు మంతనాలు జరుపుతున్నారని సమాచారం.

చాలా కాలంగా  సురేష్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరేందుకు  ప్లాన్ చేసుకొంటున్నట్టు సమాచారం.   కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు  ప్రగతి భవన్ లో  గురువారం రాత్రి  పూట కేసీఆర్ తో సమావేశమైనట్టు ప్రచారం సమాచారం.

అయితే  తొలి విడతలో  కేఆర్ సురేష్ రెడ్డి  టీఆర్ఎస్‌లో చేరనున్నారని సమాచారం. ఈ మేరకు సురేష్ రెడ్డితో  మంత్రి కేటీఆర్ శుక్రవారం నాడు  ఆయన ఇంట్లో సమావేశమైనట్టు సమాచారం. కేటీఆర్ తో పాటు కొందరు టీఆర్ఎస్ ముఖ్యులు కూడ ఉన్నారని సమాచారం.

ఇదిలా ఉంటే  సురేష్ రెడ్డి గతంలో ఆర్మూర్ రెడ్డి  పోటీ చేశారు.  అయితే  ప్రస్తుతం ఈ స్థానం నుండి  జీవన్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలో ఉన్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లు  టీఆర్ఎస్ లో చేరితే టిక్కెట్ల జాబితాలో మార్పులు చేర్పులు ఉంటాయనే ప్రచారం కూడ లేకపోలేదు.

అయితే  పార్టీలో చేరే నాయకుడిని బట్టి ఈ మార్పులు ఆధారపడి ఉంటాయనే  ప్రచారం టీఆర్ఎస్ వర్గాల్లో  సాగుతోంది. ఒకవేళ  సురేష్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరితే  ఆయనకు  ఏ స్థానం నుండి పోటీ చేసే అవకాశాన్ని కల్పిస్తారనేది ప్రస్తుతం  ఆసక్తి నెలకొంది.

బాల్కొండ స్థానం కావాలని సురేష్ రెడ్డి పట్టుబడితే  ప్రశాంత్ రెడ్డిని తప్పించి  సురేష్ రెడ్డికి టిక్కెట్టు ఇస్తారా.. లేదా  ఇతర స్థానం నుండి ఆయనకు చోటు కల్పిస్తారా అనేది  ఆసక్తి నెలకొంది.

సురేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరాలని  నిర్ణయం తీసుకొంటే  ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టంగానే  చెప్పొచ్చని  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రెండు రోజుల్లో సురేష్ రెడ్డి  టీఆర్ఎస్ లో చేరుతారని సమాచారం. టీఆర్ఎస్ లో చేరాలని సురేష్ రెడ్డిని కేటీఆర్ ఆహ్వానించారు.

సురేష్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఇవ్వనున్నట్టు టీఆర్ఎస్ నాయకత్వం హమీ ఇచ్చింది. సురేష్ రెడ్డి చాలా కాలంగా టీఆర్ఎస్ లో చేరాలని ప్లాన్ చేసుకొంటున్నారని తెలుస్తోంది. కేటీఆర్ చర్చించిన మీదట  కార్యకర్తలతో కూడ సురేష్ రెడ్డి చర్చించారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios