Asianet News TeluguAsianet News Telugu

వదల బొమ్మాళీ: కోమటిరెడ్డికి మరో షోకాజ్ నోటీసు

ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం మరోసారి షోకాజ్ నోటీసును ఇచ్చింది

congress issues another showcause notice to komatireddy rajagopal reddy
Author
Hyderabad, First Published Sep 24, 2018, 6:12 PM IST

హైదరాబాద్:ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం మరోసారి షోకాజ్ నోటీసును ఇచ్చింది. రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన వివరణ పట్ల  కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం సంతృప్తి చెందలేదు.దీంతో  మరో 24 గంటల్లోపుగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలపై మూడు రోజుల క్రితం ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలపై  కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రెండు రోజుల క్రితం షోకాజ్ నోటీసు జారీ చేసింది.

ఈ నోటీసుకు సీల్డ్ కవర్లో తన సమాధానాన్ని రాజగోపాల్ రెడ్డి సోమవారం నాడు అందించారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని తాను కోరుకొంటున్నట్టు చెప్పారు. కార్యకర్తల మనోభావాలను తాను ప్రతిబింబించే విధంగానే తాను వ్యాఖ్యలు చేసినట్టు రాజగోపాల్ రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నట్టు సమాచారం

అయితే షాకాజ్ నోటీసు జారీ చేసిన సాయంత్రమే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యులపై కూడ  తీవ్రమైన  వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై  కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యులు సోమవారం నాడు గాంధీ భవన్‌లో సమావేశమై చర్చించారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై  మూడు గంటలపాటు క్రమశిక్షణ సంఘం చర్చించారు.  మరోసారి  షోకాజ్ నోటీసు ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్న తర్వాత కూడ  ప్రెస్ పెట్టి విమర్శలు చేయడంపై కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఈ తరుణంలో ఈ ప్రెస్‌మీట్‌పై  విమర్శలను ఎక్కుపెట్టింది కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం. ఈ తరుణంలో మరోసారి షోకాజ్ నోటీసు ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నారు. సోమవారం నాడు మరోసారి షోకాజ్ నోటీసును పంపారు. 24 గంటల్లోపుగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే రాజగోపాల్ రెడ్డి కుంతియాకు వివరణ ఇచ్చినట్టు కూడ ప్రచారం సాగుతోంది. కోమటిరెడ్డి వివరణ పట్ల కుంతియా సంతృప్తి చెందినట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

సీల్డ్‌కవర్లో వివరణ: కోమటిరెడ్డి భవితవ్యంపై ఉత్కంఠ

కాంగ్రెసుపై బ్రదర్ ఫైర్: కీలక భేటీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గైర్హాజర్

కేసీఆర్ ను తిడితేనే పదవులిస్తారా: రేవంత్ కు కోమటిరెడ్డి సెటైర్

వీహెచ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కుంతియా స్పందన ఇదీ

కోమటిరెడ్డికి షాక్: షోకాజ్ నోటీసులిచ్చిన కాంగ్రెస్

గాంధీభవన్ లో డబ్బులకు పదవులు అమ్ముకుంటున్నారు: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

అసమ్మతిపై అధిష్టానం ఆగ్రహం: కోమటిరెడ్డికి నోటీసులు?

ఇక్కడ కేసీఆర్‌కు, అక్కడ జగన్‌కు కోవర్టులు: వీహెచ్ సంచలనం

టీపీసీసీ కొత్త కమిటీల ఎఫెక్ట్: ట్విస్టిచ్చిన సుధీర్ రెడ్డి

టీపీసీసీ కొత్త కమిటీ ఎఫెక్ట్: కాంగ్రెస్‌లో కేసీఆర్ కోవర్టులు: వీహెచ్

రేవంత్ రెడ్డికి కాంగ్రెస్‌లో నిరసన సెగ

కాంగ్రెస్ తీరు: కారెక్కిన సురేష్‌రెడ్డికి మూడు కమిటీల్లో చోటు

ఎన్నికల కమిటీలు: కాంగ్రెస్‌లో ఇక రేవంత్ జోరు

Follow Us:
Download App:
  • android
  • ios