Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ ను తిడితేనే పదవులిస్తారా: రేవంత్ కు కోమటిరెడ్డి సెటైర్

కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా సంఘం నుంచి షోకాజ్ నోటీసులు రావడంపై స్పందించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. షోకాజ్ నోటీసులకు సమాధానం రెండు రోజుల్లో చెప్పామన్నారని రెండు రోజులు కాదు రెండు గంటలు చాలన్నారు. 

komati reddy rajagopal reddy explanation on shokaj
Author
Hyderabad, First Published Sep 21, 2018, 8:02 PM IST

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా సంఘం నుంచి షోకాజ్ నోటీసులు రావడంపై స్పందించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. షోకాజ్ నోటీసులకు సమాధానం రెండు రోజుల్లో చెప్పామన్నారని రెండు రోజులు కాదు రెండు గంటలు చాలన్నారు. 

మునుగోడు కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభవాలను మాత్రమే గట్టిగా చెప్పానని తెలిపారు. పీసీసీ ప్రకటించిన కమిటీలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ హైకమాండ్ వాస్తవమా కాదా ఆత్మ పరిశీలన చేసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచించారు. 

కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం పోరాటం చేసిన వారిని, తెలంగాణ కోసం కృషి చేసిన వారిని పక్కన పెట్టడంతో ఆవేదన చెందానని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం ప్రయత్నించడం లేదని కొంతమంది ముఖ్యమంత్రి పీఠం కోసం ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 

కాంగ్రెస్ పార్టీలో సమర్థవంతమైన నాయకత్వం ఉంటే నాలుగేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు పుంజుకో లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ పుంజుకోకపోవడానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంచార్జ్ కుంతియా మధ్య సమన్వయ లోపంపై చర్చించుకోవాలని సూచించారు. షోకాజ్ నోటీసులు జారీ చెయ్యడం కాదని, నా వ్యాఖ్యలను సూచనగా తీసుకోవాలని సూచించారు. 

గత ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ వల్ల, బలహీనమైన ఎమ్మెల్యే అభ్యర్థుల వల్ల కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని తెలిపారు. ఫలితంగా తాను ఓటమిపాలవ్వాల్సి వచ్చిందన్నారు. తాను ఓటమి పాలైన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందామన్నారు. తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందండం వల్ల కాంగ్రెస్ పార్టీలో నూతనోత్సాహం నెలకొందని తెలిపారు. 

నిరంతరం పార్టీ కోసం శ్రమిస్తున్న తమను పక్కనపెట్టేలే కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న మెున్న పార్టీలోకి వచ్చిన వారిని కమిటీలలో పెట్టి తమను ఇంటికి పరిమితం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు కావాల్సింది పదవులు కాదని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమేనన్నారు.  

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని తెలిసి కూడా యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. అయితే ఆ ఎన్నికల్లో నేతల సమన్వయ లోపం వల్లే ఓడిపోయామని తెలిపారు. సీఎం కుర్చీ కోసం పోటీపడుతున్నవారే తప్ప పార్టీ గెలుపుకోసం ప్రయత్నించిన వారు కరువయ్యారన్నారు. 

తాజాగా ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో మళ్లీ సీఎం పీఠం కోసం రాజకీయాలు మెుదలయ్యాయని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ కమిటీ నిద్రపోతుందన్నారు. అందుకు నిదర్శనమే టీఆర్ఎస్ పార్టీలో చేరిన కేఆర్ సురేష్ రెడ్డిని మూడు కమిటీలలో చేర్చడమన్నారు. 

తెలంగాణలో టీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయని తమలాంటి వాళ్లకు బాధ్యతలు అప్పగిస్తే పార్టీని గెలిపిస్తామన్నారు. గాంధీభవన్ లో కూర్చుని షోకాజ్ నోటీసులు ఇవ్వడం, ప్రెస్ మీట్ లు పెట్టుకోవడం వల్ల పార్టీ అధికారంలోకి రాదన్నారు. ఇతర పార్టీలో నుంచి వచ్చిన వ్యక్తులకు కీలక దవులను అప్పగిస్తే సీనియర్లు అవమానంగా భావించరా అని ప్రశ్నించారు. 

కేసీఆర్ ను తిడితేనే పదవులు ఇస్తారా, బూతుపురాణం చెబితేనే పదవులు ఇస్తారా, సంస్కారంగా మాట్లాడే మాకు ఇవ్వరా అని ప్రశ్నించారు. మరోవైపు 75 ఏళ్లు నిండిన వాళ్లు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తామంటే ఎలా అన్నారు. రిటైర్మెంట్ తీసుకోవాల్సిన వయసులో కూడా ఇంకా ముందు వరుసలో కూర్చుంటామంటున్నారని తెలిపారు. 

 రాబోయే రోజుల్లో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోనియాగాంధీ,రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ గెలుస్తోందన్నారు. 

మరోవైపు పీసీసీ కమిటీలో 41 మంది సభ్యులకు చోటు కల్పించడంపై అసహనం వ్యక్తం చేశారు. పీసీసీలో 8 మంది సభ్యులు ఉంటారని అలా కాకుండా 41 మందిని సభ్యులుగా పెట్టడంతో ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. కో ఆర్డినేషన్ కమిటీ 54 మంది సభ్యులున్నారని ఇంతమంది ఎందుకు అని ప్రశ్నించారు. 

మేనిఫెస్టో కమిటీ ఇప్పుడేందుకు అని ప్రశ్నించారు. మేనిఫెస్టో గురించి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మెుత్తం చెప్పిన తర్వాత ఇంకా మేనిఫెస్టో కమిటీ ఎందుకని ప్రశ్నించారు. కొంతమంది నాయకుల స్వార్థం కోసం మాలాంటి వాళ్లం బలైపోతున్నామన్నారు.  
 
ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పునరాలోచించుకోవాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు. వేసిన కమిటీలను రద్దు చేసి 8 మందితో కొత్తకమిటీ వెయ్యాలని సూచించారు. అలాగే పార్టీ గెలుపుకోసం తనలాంటి వారిని భాగస్వామ్యం చేసుకోవాలని కోరారు. తాను ఎప్పుడు పార్టీ గెలుపుకోసం కృషి చేస్తానని పార్టీలోనే ఉంటానని తెలిపారు.

సంబంధిత వార్తలు

కోమటిరెడ్డికి షాక్: షోకాజ్ నోటీసులిచ్చిన కాంగ్రెస్

గాంధీభవన్ లో డబ్బులకు పదవులు అమ్ముకుంటున్నారు: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

అసమ్మతిపై అధిష్టానం ఆగ్రహం: కోమటిరెడ్డికి నోటీసులు?

ఇక్కడ కేసీఆర్‌కు, అక్కడ జగన్‌కు కోవర్టులు: వీహెచ్ సంచలనం

టీపీసీసీ కొత్త కమిటీల ఎఫెక్ట్: ట్విస్టిచ్చిన సుధీర్ రెడ్డి

టీపీసీసీ కొత్త కమిటీ ఎఫెక్ట్: కాంగ్రెస్‌లో కేసీఆర్ కోవర్టులు: వీహెచ్

రేవంత్ రెడ్డికి కాంగ్రెస్‌లో నిరసన సెగ

కాంగ్రెస్ తీరు: కారెక్కిన సురేష్‌రెడ్డికి మూడు కమిటీల్లో చోటు

ఎన్నికల కమిటీలు: కాంగ్రెస్‌లో ఇక రేవంత్ జోరు

Follow Us:
Download App:
  • android
  • ios