తెలంగాణ ఎన్నికల కోసం కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు.. 26 మందికి చోటు.. కమిటీ చైర్మన్ ఎవరంటే..?
తెలంగాణ కాంగ్రెస్‌లో ఎన్నికల సందడి నెలకొంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఆ పార్టీ నేతలు ఇప్పటినుంచే సిద్దమవుతున్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో ఎన్నికల సందడి నెలకొంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఆ పార్టీ నేతలు ఇప్పటినుంచే సిద్దమవుతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయంతో.. ఇక్కడి నేతల్లో కూడా జోష్ నెలకొంది. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం కూడా తెలంగాణపై ప్రత్యేక ఫోకస్.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధిష్టానం నుంచి మరో కీలక ప్రకటన వెలువడుతుంది. తెలంగాణ ఎన్నికల కోసం కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేసింది. టీపీసీసీ చీఫ్ రేవంత్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సహా 26 మంది సభ్యులకు ఈ కమిటీలో చోటు కల్పించారు.రేవంత్ రెడ్డి ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.
ఈ కమిటీ ప్రతిపాదనకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోద ముద్ర వేశారని.. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఇక, ఈ కమిటీలో ఎక్స్ అఫిషియో మెంబర్స్‌గా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, స్టేట్ సేవా దళ్ చీఫ్ ఆర్గనైజర్ ఉండనున్నారు.
కమిటీలో సభ్యులు..
1. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
2. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
3. ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి
4. బొమ్మ మహేష్ కుమార్ గౌడ్
5. జగ్గారెడ్డి
6. గీతారెడ్డి
7. మహమ్మద్ అజారుద్దీన్
8. అంజన్ కుమార్ యాదవ్
9. అంజన్ కుమార్ యాదవ్
10. జానారెడ్డి
11. పొన్నాల లక్ష్మయ్య
12. ఉత్తమ్ కుమార్ రెడ్డి
13. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
14. దామోదర రాజనర్సింహ
15. మధుయాష్కి గౌడ్
16. దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
17. చల్లా వంశీచంద్ రెడ్డి
18. ఎస్‌ఏ సంపత్ కుమార్
19. రేణుకా చౌదరి
20. బలరాం నాయక్
21. పొడెం వీరయ్య
22. సీతక్క
23. షబ్బీర్ అలీ
24. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
25. ప్రేమ్‌సాగర్ రావు
26. సునీతా రావు