తెలంగాణ హరీష్ నీళ్ళ దొంగ

తెలంగాణ హరీష్  నీళ్ళ దొంగ

మరో కాంగ్రెస్ సీనియర్ నేత వివాదాస్పద కామెంట్స్ చేసి సంచలనం సృష్టించారు. కాంగ్రోస్ బస్సు యాత్రలో భాగంగా బాల్కొండ నియోజకవర్గం బీమ్ గల్ లో జరిగిన ప్రజాచైతన్య యాత్ర లో అనీల్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి బాల్కొండ నియోజకవర్గానికి రావాల్సిన నీటిని మంత్రి హరీష్ దోచుకుపోయాడని ఆరోపించారు. హరీష్ రావు నీళ్ళ దొంగ అని దుమ్మెత్తిపోశారు. అలాగే మంత్రి కేటిఆర్ మీద కూడా పరుష కామెంట్స్ చేశారు అనీల్. కేటిఆర్ లుచ్చా అని కామెంట్ చేశారు.

అంతేకాదు హరీష్ బాల్కొండ నియోజకవర్గంలో కాలు పెడితే నరికి పారేస్తామంటూ నోరు జారారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరుతో బాల్కొండకు రావాల్సిన నీటిని సిద్ధిపేట, సిరిసిల్ల మెదక్ ప్రాంతాలకు తరలించుకుపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన నీటిని తరలించుకుపోతున్నా.. స్థానిక టిఆర్ఎస్ నేతలు నోరు మూసుకుని ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్కారు చర్యలతో తమ కడుపు రగిలిపోతున్నదని, ఆవేదనతోనే తాము తిట్టాల్సివస్తోందని అనీల్ అన్నారు. పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే అనీల్ ఈ తీవ్ర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.

అనీల్ పై పోలీసులకు ఫిర్యాదు

అనీల్ వివాదాస్పద కామెంట్స్ చేయడంపై టిఆర్ఎస్ మండిపడింది. అనీల్ మీద చర్యలు తీసుకోవాలంటూ సిద్ధిపేట మున్సిపల్ కౌన్సిలర్ ధర్మవరం బ్రహ్మం, అడ్వొకెట్ వెంకటలింగం లు రాష్ట్ర డిజిపికి ఫిర్యాదు చేశారు. హరీష్ రావు బాల్కొండ వస్తే చంపేస్తాం అనడం జాతి విద్రోహ చర్యగా తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. 


Sign in to Comment/View Comments

Recent News

Recent Videos