కోదండరాంపై కేటీఆర్ విమర్శలపై కాంగ్రెస్ ధ్వజం
తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాంపై రాష్ట్ర మున్సిపల్ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్.. కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన నడుస్తోందని విమర్శించారు.
దురహంకారంతోనే కేసీఆర్ కొడుకు ... కోదండరాంను విమర్శిస్తున్నారని అన్నారు. కోదండరాం భూనిర్వాసితుల సమస్య గురించి మాట్లాడారే తప్ప ప్రాజెక్టులను వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.
విమలక్క కార్యాలయాన్ని సీజ్ చేయడం సరికాదని, ప్రభుత్వం సీజ్ చేసింది టఫ్ కార్యాలయాన్ని మాత్రమే కాదని ప్రశ్నించే గొంతులని కూడా అని వ్యాఖ్యానించారు.
