Asianet News TeluguAsianet News Telugu

'ఒక్క అసెంబ్లీ, రెండు ఎమ్మెల్సీ స్థానాలు':కాంగ్రెస్, సీపీఐ మధ్య కుదిరిన పొత్తు

సీపీఐ నేతలతో  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  ఇవాళ చర్చలు జరిపారు.సుదీర్ఘకాలంగా  రెండు పార్టీల మధ్య చర్చలు సాగుతున్నాయి.ఈ చర్చలకు  ఇవాళ ముగింపు పలికారు  రెండు పార్టీల నేతలు.  సీపీఐకి ఒక్క అసెంబ్లీ సీటును ఇచ్చేందుకు  కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.

Congress decides  give 1 assembly seat and Two MLC Seats to CPI lns
Author
First Published Nov 6, 2023, 5:57 PM IST

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు కుదిరిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  ప్రకటించారు. 

సోమవారంనాడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  సీపీఐ కార్యాలయంలో  ఆ పార్టీ నేతలతో  చర్చించారు.   సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ,  సీపీఐ  రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తదితరులు రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు.  కాంగ్రెస్, సీపీఐ నేతలు  పొత్తుపై చర్చించారు.  ఈ సమావేశంలో చర్చించిన విషయాలను  మీడియాకు వివరించారు రెండు పార్టీల నేతలు.

 ఈ ఎన్నికల్లో కొత్తగూడెం అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ కు కేటాయించినట్టుగా  రేవంత్ రెడ్డి  మీడియాకు చెప్పారు.   కొత్తగూడెం అసెంబ్లీ స్థానంతో పాటు  తమ పార్టీ అధికారంలోకి రాగానే  రెండు ఎమ్మెల్సీలను  కూడ సీపీఐకి కేటాయించనున్నట్టుగా  ఆయన  చెప్పారు.కొత్తగూడెంలో  సీపీఐ అభ్యర్ధి విజయం కోసం  కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కృషి చేస్తాయని రేవంత్ రెడ్డి  తెలిపారు. కాంగ్రెస్, సీపీఐ సమన్వయం కోసం కమిటీని ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి  చెప్పారు. మోడీ, కేసీఆర్ వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

తెలంగాణ ప్రజలకు కేసీఆర్ పాలన నుండి విముక్తి అవసరమని  సీపీఐ  తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి  కూనంనేని సాంబశివరావు చెప్పారు. ఈ కారణంతోనే  కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నామని  సాంబశివరావు చెప్పారు.  నెల రోజుల క్రితం  నిశ్చితార్థం జరిగితే  ఇవాళ పెళ్లి అయిందని  సీపీఐ జాతీయ కార్యదర్శి  నారాయణ అభిప్రాయపడ్డారు.ఎన్ని సీట్లు ఇచ్చారనేది ముఖ్యం కాదు,  కేసీఆర్ పాలన నుండి ప్రజలను విముక్తి చేశామా లేదా అనేది  ముఖ్యమని  నారాయణ  చెప్పారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios