కేసీఆర్ రీ డిజైన్ల స్పెషలిస్ట్: రాహుల్

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 14, Aug 2018, 5:45 PM IST
Congress chief rahulgandhi sensational comments on KCR
Highlights

ప్రాజెక్టుల రీ డిజైన్ల స్పెషలిస్టు తెలంగాణ సీఎం కేసీఆర్ అని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. 

హైదరాబాద్: ప్రాజెక్టుల రీ డిజైన్ల స్పెషలిస్టు తెలంగాణ సీఎం కేసీఆర్ అని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. 


సరూర్‌నగర్‌లోని స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విద్యార్థి- నిరుద్యోగ గర్జన సభలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ పాల్గొన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాల కోసం  ఆందోళన జరిగిన విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలను తెలుగులో చెప్పి రాహుల్ చెప్పారు.

తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్దామన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనా కూడ  ఆ ఆశలు నెరవేరలేదన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటైనా నాలుగేళ్లలో కనీసం 10 వేల  ఉద్యోగాలను కూడ భర్తీ చేయలేదని రాహుల్ గాంధీ చెప్పారు.

ఎన్నికల సమయంలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని  కేసీఆర్ హమీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ, పదివేల ఉద్యోగాలను కూడ  భర్తీ చేయలేదన్నారు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో విద్యార్థుల పాత్ర మరువలేనిదన్నారు. నోటిఫికేషన్లు ,రిక్రూట్‌మెంట్స్ లేవన్నారు. తెలంగాణ అమరులకు తాను శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్టు ఆయన చెప్పారు. పీజు రీ ఎంబర్స్ మెంట్ పథకాన్ని అమలు చేయడం లేదన్నారు.  

ఏ ప్రజల ఆశయాల కోసం తెలంగాణ ఏర్పాటైందో  ఆ ఆశయాలు నెరవేరడం లేదన్నారు.  ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును అంబేద్కర్ పేరు ఉండేది. కానీ, అంబేద్కర్ పేరును కూడ మార్చారు. ఈ ప్రాజెక్టుకు కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారని ఆయన చెప్పారు.

సుమారు 35 వేల కోట్ల ప్రాజెక్టు లక్షకోట్లకు వ్యయం పెరిగిందని రాహుల్ ఆరోపించారు. రీ డిజైన్ల పేరుతో ఒక్క కుటుంబం జేబుల్లోకి  వెళ్తున్నాయని  రాహుల్ ఆరోపించారు. కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైన్ స్పెష్టలిస్ట్ అంటూ  కేసీఆర్‌పై  రాహుల్ విమర్శలు గుప్పించారు.

ఢిల్లీలో కూడ మోడీ , తెలంగాణలో కేసీఆర్ రీ డిజైన్లకు పాల్పడుతున్నారని ఆయన  చెప్పారు. రీ డిజైన్లు అంటే అవినీతి, దోపీడీ అని రాహుల్ చెప్పారు. 

రాఫెల్ కాంట్రాక్టును ప్రధాని మోడీ తన స్నేహితుడికి అప్పగించారని రాహుల్ ఆరోపించారు. తన స్నేహితుడు అనిల్ అంబానీకి  రాఫెల్ ప్రాజెక్టును గిఫ్ట్ గా ఇచ్చారని  చెప్పారు.ఎలాంటి అనుభవం లేని అనిల్ అంబానీకి రాఫెల్ ప్రాజెక్టును కట్టబెట్టారని చెప్పారు. 

ప్రధాని చేసే రీ డిజైన్లను కేసీఆర్ సమర్థించారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మోడీ ధర్నా చౌక్ ను ఎత్తేశాడు. తెలంగాణలో కూడ కేసీఆర్ ధర్నా చౌక్ ను ఎత్తేశాడని రాహుల్ చెప్పారు.ప్రజలు తమ సమస్యలను ఎవరికీ చెప్పుకోవాలని ఆయన ప్రశ్నించారు.

బేటీ బచావో, బేటీ బడావో అని మోడీ చెబుతారు. యూపీలో బీజేపీ ఎమ్మెల్యే ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బీజేపీ నేతల నుండి ఆడపిల్లలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

అంతర్జాతీయంగా 140 నుండి 70 డాలర్లకు తగ్గినా దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు తగ్గుతున్నాయని రాహుల్ చెప్పారు
పెట్రోల్ ధరలు పెరగడం వల్ల పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు, ఆయిల్ కంపెనీలకు చేరుతున్నాయన్నారు. జీఎస్టీ, నోట్ల రద్దు తదితర పద్దతుల ద్వారా ప్రజల జేబుల్లో నుండి 25 లేదా 30 మంది పారిశ్రామికవేత్తల జేబుల్లోకి చేరుతోందన్నారు.

రాఫెల్ కుంభకోణంపై నేను ఎక్కడైనా చర్చకు సిద్దం.. మోడీతో పాటు అనిల్ అంబానీతో పాటు చర్చకు సిద్దం చేస్తామన్నారు. రూ.1600 కోట్లతో విమానాల కోనుగోలు విషయమై చర్చకు తాను సిద్దమని రాహుల్ సవాల్ విసిరారు.

దేశంలోని అత్యధికంగా స్కూల్ ఫీజులు  తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని రాహుల్ చెప్పారు. నాలుగేళ్లలో 400 శాతం ఫీజులు పెరిగాయని రాహుల్ చెప్పారు.
తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడితే ఉద్యోగులు కల్పిస్తామన్నారు. రైతులను కాపాడుతామన్నారు. విద్యాసంస్కరణలు, ఆరోగ్యంలో సంస్కరణలు తెస్తామని ఆయన హమీ ఇచ్చారు. తక్కువ ఖర్చుతోనే విద్య, వైద్యం అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.

యువత రాజకీయాల్లోకి రావాలని రాహుల్ గాంధీ కోరారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆయన కోరారు.మీ బలాన్ని ఒక్క కుటుంబం దోచుకొంటుందన్నారు.  దేశంలో మోడీ దోపీడీ చేస్తే తెలంగాణలో కేసీఆర్ కూడ అదే రకమైన దోపీడీకి పాల్పడుతున్నాడని రాహుల్ విమర్శించారు.

పార్టీ కోసం పనిచేసినవారికే  టిక్కెట్లను కేటాయించనున్నట్టు రాహుల్ గాంధీ ప్రకటించారు. ప్యారాచ్యూట్‌లు వేసుకొని వచ్చేవారికి టిక్కెట్లు దక్కవన్నారు.  పార్టీ కోసం పనిచేసేవారికే  టిక్కెట్లు ఉంటాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తమ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తోందని రాహుల్ గాంధీ హమీ ఇచ్చారు. 
 

ఈ వార్తలు చదవండి

అధికారంలోకి రాగానే ప్రతి నెల రూ. 3 వేలు నిరుద్యోగభృతి: యువతకు ఉత్తమ్ హమీ

రాహుల్ తెలంగాణ పర్యటన: గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళి

పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలిస్తాం: రాహుల్

కాంగ్రెస్‌తోనే నా పెళ్లి జరిగింది: రాహుల్

సెక్యులర్ పార్టీలతో పొత్తులు: రాహుల్‌కు చిన్నారెడ్డి సూచన

loader