Asianet News TeluguAsianet News Telugu

అధికారంలోకి రాగానే ప్రతి నెల రూ. 3 వేలు నిరుద్యోగభృతి: యువతకు ఉత్తమ్ హమీ

తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ప్రతి నెల రూ.మూడు వేలను నిరుద్యోగ భృతిని ఇవ్వనున్నట్టు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. నిరుద్యోగ భృతిని అమలు చేసి చూపిస్తామన్నారు. 

we will provide three thousand incentive for unemployment youth says Uttam
Author
Hyderabad, First Published Aug 14, 2018, 5:27 PM IST


హైదరాబాద్:  తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ప్రతి నెల రూ.మూడు వేలను నిరుద్యోగ భృతిని ఇవ్వనున్నట్టు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. నిరుద్యోగ భృతిని అమలు చేసి చూపిస్తామన్నారు. 

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నాడు సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన  విద్యార్థి-నిరుద్యోగ సభ గర్జన సభలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి  పాల్గొన్నారు.

గతంలో ఫీజు రీఎంబర్స్ మెంట్  ను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీ ఎంబర్స్ మెంట్ ను టీ సర్కార్ పట్టించుకోలేదన్నారు. 

ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి  వస్తోందన్నారు.తమ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు రూ.3వేలను అందిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హమీ ఇచ్చారు. 

పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 15 లక్షల మంది నిరుద్యోగులుగా తమ పేర్లను నమోదు చేసుకొన్నారని ఆయన చెప్పారు. తెలంగాణలో కనీసం పది లక్షల మందికి నిరుద్యోగ భృతిని ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

తాము నిరుద్యోగులకు ఎలా పరిహారాన్ని చెల్లిస్తామో చెప్పాలని సీఎం కేసీఆర్ చేసిన విమర్శలపై ఆయన ఘాటుగా స్పందించారు. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios