తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల కసరత్తు ప్రక్రియ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే అభ్యర్ధుల ప్రకటన ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్ సమావేశానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో సమావేశాలు ముగిసిన తర్వాతే ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల కసరత్తు ప్రక్రియ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే అభ్యర్ధుల ప్రకటన ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్ సమావేశానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో సమావేశాలు ముగిసిన తర్వాతే ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ రెండో వారంలోనే అభ్యర్ధుల ప్రకటన ప్రకటించే అవకాశం వుంది. మరోవైపు టీ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ రేపు ఉదయం 10 గంటలకు సమావేశం కానుంది. మరోవైపు ఆదివారం జరిగిన సమావేశంలో మాజీ మంత్రి చిన్నారెడ్డిపై వనపర్తి నేతలు ఫిర్యాదు చేశారు. ఆయనకు టికెట్ ఇవ్వొద్దని నేతలు కోరారు.
ఇకపోతే.. ఆశావాహులు గతంలో ఏఏ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశారు, ఎన్ని దఫాలు విజయం సాధించారు? ఎన్ని దఫాలు ఓటమి పాలయ్యారు?కాంగ్రెస్ పార్టీలో ఎంతకాలం నుండి పనిచేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వంపై ఆశావాహులు చేసిన పోరాటాలకు సంబంధించిన అంశాలను కాంగ్రెస్ ఎన్నికల కమిటీ పరిశీలించనుంది.
Also Read: నేడే తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ: 530 మందితో ఆశావాహుల జాబితా
గత నెల 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సుమారు 1006 మంది నుండి ధరఖాస్తులు వచ్చాయి. ఈ ధరఖాస్తుల నుండి 530 మందితో ఆశావాహుల జాబితాను కాంగ్రెస్ పార్టీ సిద్దం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ ఇచ్చిన జాబితాతో రేపు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ కానుంది. ఎన్నికల కమిటీ సభ్యులతో స్క్రీనింగ్ కమిటీ చర్చించనుంది. ఈ చర్చల తర్వాతే ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక్క అభ్యర్థి పేరును సూచిస్తూ కేంద్ర ఎన్నికల కమిటీకి స్క్రీనింగ్ కమిటీ సిఫారసు చేయనుంది. స్క్రీనింగ్ కమిటీ సూచించిన పేరును కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించనుంది. వరుసగా మూడు రోజుల పాటు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేయనుంది.
