హైదరాబాద్: దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మండలాలవారీగా ఇంఛార్జీలను నియమించింది. ఎన్నికల ప్రచారం పూర్తయ్యేవరకు ఆయా మండలాల్లో పార్టీ బాధ్యతలను ఈ నేతలు పర్యవేక్షించనున్నారు.

పీసీసీ చీఫ్ తో పాటు పార్టీకి చెందిన కీలక నేతలకు మండలాలవారీగా కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీలను నియమించింది. గ్రామాల వారీగా కూడ కాంగ్రెస్ పార్టీ నేతలకు బాధ్యతలను అప్పగించనున్నారు.

నవంబర్ 3వ తేదీన దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. టీఆర్ఎస్ లోని అసమ్మతిని తమకు అనుకూలంగా మలుచుకొనేందుకు ఆ పార్టీ నాయకత్వం ప్లాన్ చేస్తోంది.బీజేపీ నేతలు కూడ ఈ స్థానంపై కేంద్రీకరించి పనిచేస్తున్నారు. 

మండలాల వారీగా ఇంచార్జీలు

దుబ్బాక -ఉత్తమ్ కుమార్ రెడ్డి
మిరుదొడ్డి -రేవంత్ రెడ్డి
తొగుట -దామోదర రాజనర్సింహ
చేగుంట- మల్లుభట్టి విక్రమార్క
నర్సింగి -పొన్నాల లక్ష్మయ్య
గజ్వేల్ -గీతారెడ్డి
దౌల్తాబాద్-కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
రాయపోల్-శ్రీధర్ బాబు