రాజ్ భవన్ వైపు కాంగ్రెస్ ర్యాలీ, పోలీసులతో వాగ్వాదం: నేతల అరెస్ట్

 ధరల పెరుగుదలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు శుక్రవారం నాడు ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. రాజ్ భవన్  వైపునకు ర్యాలీగా వెఁళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. 

Cong workers arrested during protest march to Raj Bhavan

 హైదరాబాద్: ధరల పెరుగుదలను నిరసిస్తూ Congress  పార్టీ నేతలు శుక్రవారం నాడు ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నా ముగించిన తర్వాత Raj Bhavan  వైపునకు ర్యాలీగా వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. Indira Park  నుండి రాజ్ భవన్ వైపునకు ర్యాలీగా బయలు దేరారు. అయితే ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు కాంగ్రెస్ నేతలను అడ్డుకొన్నారు. ఈ సమయంలో పోలీసులతో కాంగ్రెస్ పార్టీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. పోలీసులకు, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట చోటు చేసుకొంది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేశారు.

ధరల పెరుగుదలను నిరసిస్తూ ఇవాళ దేశ వ్యాప్తగా నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.ఈ నిరసనలో భాగంగా Hyderabad  లో నిర్వహించిన నిరసనలో సీఎల్పీ నేత మల్లు  భట్టి విక్రమార్క సహా పలువురు నేతలు కూడా పాల్గొన్నారు. 

న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు నిరసనలో పాల్గొన్నారు. ఈ నిరసనలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు ఆ పార్టీ అగ్రనేతలు, ఎంపీలు పాల్గొన్నారు.ధరల పెరుగుదలను నిరసిస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ నిరసన కార్యక్రమాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ తలపెట్టింది.ఈ నిరసన కార్యక్రమాల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios