ఇటీవల ఆస్ట్రేలియా దేశంలోని గోల్డెకోస్ట్ నగరంలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో బ్యాడ్మింటన్ టీమ్ విభాగంలో గోల్డ్ మెడల్, వ్యక్తిగత విభాగంలో రజత  పథకాలు సాధించారు నీలకుర్తి సిక్కి రెడ్డి. ఆమె గురువారం సచివాలయంలో సందడి చేశారు. సచివాలయంలో తెలంగాణ టూరిజం, స్పోర్ట్స్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తో భేటీ అయ్యారు. బుర్రా వెంకటేశం పూలబొకే ఇచ్చి అభినందించారు. గోల్డ్ మెడల్ తో పాటు రజత పతకం సాధించిన తీరును ఆమె వివరించారు.

అనంతరం ఆమె తెలంగాణ క్రీడలు, ఎక్సైజ్ శాఖా మంత్రి పద్మారావు గౌడ్ ను కలిశారు. ఈ సందర్భంగా తన పతకం సాధన అనుభవాలను మంత్రితో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, ఉన్నతాధికారులు ఉన్నారు.  వీడియో పైన ఉంది చూడండి.