అనూహ్యంగా పెరిగిపోతున్న ఊష్ణోగ్రతలు ఒకవైపు, విద్యుత్ చార్జీల భారం మరోవైపు సామాన్య మానవులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎండ మంట, ఉక్కపోత నుంచి జనాలు అవస్థలు పడే రోజులివి. ఎసిలు బిగించుకుంటే వేలాదిరూపాయల కరెంటు బిల్లలు చేతికిచ్చే కాలం. దీంతో సామాన్యుల ఇబ్బందులు అంతా ఇంతా కాదు.

48, 49 డిగ్రీల టెంపరేచర్ తో అసలు వేసవిలో ఎసి లేనిదే మనిషి బతకలేని పరిస్థితి నెలకొంది. మరి ఎసి పెట్టుకుంటే కరెంటు బిల్లు వాచిపోయి జేబులు చిల్లు కావాల్సిందే. దీంతో సామాన్యులకు ఎసి అందుబాటులో లేకుండాపోతున్నది.

ఇప్పుడు సామాన్యులకు సైతం ఎసి బెడ్స్ అందుబాటులోకి తెచ్చేందుకు ఓ సంస్థ ముందుకొచ్చింది. మార్కెట్ లోకి అత్యంత చౌక ఎసి బెడ్స్ యూనిట్ ను ను ప్రవేశపెట్టింది టుపిక్ వరల్డ్ అనే సంస్థ. ఈ ఎసి ల నిర్వహణ ఖర్చు చాలా చాలా తక్కువట.

ఈ ఎసి బెడ్స్ నిర్వహణ ఖర్చు నెలకు కేవలం 500 రూపాయలు మాత్రమే సరిపోతాయట. ఈ ఎసి యూనిట్ నడవడానికి కేవలం 400 వాట్స్ విద్యుత్ సరిపోతుందని కంపెనీ చెబుతోంది.

మరింత ముఖ్యమైన విషయమేమంటే సింగిల్ బెడ్ ఎసి యూనిట్, డబుల్ బెడ్ ఎసి యూనిట్లను సైతం అందుబాటులోకి తెచ్చింది టుపిక్ వరల్డ్. ఈ ఏసి బెడ్ నిర్మాణంలో ప్రత్యేక ఫ్యాబ్రిక్ టెంట్, చిన్న ఏసి యూనిట్ అమర్చబడి ఉంటాయి.

పడక గదిలో గది మొత్తానికి ఎసి ఉండాలంటే ఖర్చుతో కూడుకున్న పని. అదే పడుకునే మంచం చుట్టూ మాత్రమే చల్లదనం ఉంటే బాగుంటుంది కదా? ఈ కాన్పెప్ట్ తోనే మంచం చుట్టూ ఫ్యాబ్రిక్ టెంట్ తో కూడిన ఏర్పాటు చేసి అందులో మాత్రమ ఎసి సౌకర్యం ఉండేలా దీన్ని రూపొందించారు.

మొత్తానికి వచ్చే వేసవి నాటికి ఈ టుపిక్ ఎపి బెడ్స్ వినియోగం పెరిగిపోయే చాన్స్ ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.