హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో 35 మరణాలపై డెత్ కమిటీ రిపోర్టు  రావాల్సి ఉందని సూపరింటెండ్ డాక్టర్ రాజారావు తెలిపారు.బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.  గాంధీకి చివరి నిమిషంలో రోగులు వస్తున్నారని ఆయన చెప్పారు. చనిపోయినవారంతా కరోనా పేషేంట్లు కాదన్నారు.

ప్రైవేట్ ఆసుపత్రులు తమను ఇంజక్షన్లు అడుగుతున్నారని ఆయన చెప్పారు. తమ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ కొరత లేదన్నారు. గాంధీలో 500 మందికి  కరోనా రోగులకు బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు.   అవసరమైతే  ఈ బెడ్స్ ను వెయ్యికి పెంచుతామని ఆయన చెప్పారు.

తెలంగాణలో కరోనా రోగులు ఎక్కువగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స తీసుకొంటున్నారు. చివరి నిమిషంలో తమ ఆసుపత్రికిి రావడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయని ఆయన చెప్పారు. వ్యాధి తీవ్రత పెరగక ముందే రావాలని ఆయన రోగులకు సూచిస్తున్నారు. 

గత ఏడాదిలో గాంధీ ఆసుపత్రిలో కేవలం కరోనా చికిత్సకు మాత్రమే ఉపయోగించారు. ఇటీవల కాలంలోనే కరోనాతో పాటు ఇతర వ్యాధులకు కూడ చికిత్స అందిస్తున్నారు. ఇదే సమయంలో కరోనా కేసులు రాష్ట్రంలో పెరిగిపోవడంతో మరోసారి కోవిడ్ కేసులపై గాంధీ ఆసుపత్రి సిబ్బంది కేంద్రీకరించాల్సి వస్తోంది.