స్కూల్ ఇన్స్ పెక్షన్ లో షాక్ తిన్న పాలమూరు కలెక్టర్ రోనాల్డ్ రాస్…
మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ కు ఎక్కడా ఎదురు కాని వింత అనుభవం ఎదురయిందదొక స్కూల్లో.
దాంతో షాక్ తిన్నారు. బహుశా ఇంకా కోలుకోని ఉండరు.
ఆయన ఈ రోజు మిడ్జిల్ మండలం వల్లభరావుపల్లి ప్రభుత్వ పాఠశాలను అకస్మికంగా సందర్శించారు.
సాధారణంగా కలెక్టర్లు ఇలాంటి పనులు చేయరు. డిఇవో లు చేస్తుంటారు. రోస్ కొంచెం భిన్నమయిన వాడు. భిన్నంగా ఆలోచిస్తాడు. భిన్నంగా పనిచేస్తుంటాడు. అందుకే ఈ స్కూల్ చూద్దామనుకున్నాడు.
స్కూళ్లోకి వెళ్లి కొద్దిసేపు పిల్లలతో సరదగా గడిపాడు. అయితే, చివర్లో వారికి ఆయనొక పరీక్షపెట్టాలనుకున్నారు.
ఐదవ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ వారి కుటుంబ వివరాలు కూడా కనుక్కున్నారు. తర్వాత మీ తల్లిదండ్రుల పేర్లు పేపరు మీద రాయండని అడిగారు.
అక్కడే ఆయన షాక్ తిన్నంది.
తరగతిలో ఉన్న పిల్లల్లో ఎక్కువమంది తమ తల్లిదండ్రుల పేర్లను రాయలేకపోయారు.ఈ పేర్లలో దొర్లిన తప్పులు చూసి హతాశుడయిపోయిన కలెక్టర్ రోస్ టీచర్ల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరేం చదువులు చెబుతున్నారని నిలదీసి , మిరక్కడ పనికిరారని చెప్పారు.
మీ పిల్లలు కూడా ఇలాగే ఉన్నారా, వారెక్కడ చదువుతున్నారో చెప్పాలన్నారు. అంతా కార్పొరేట్ స్కూళ్ల పేర్లు చెప్పారు.
దీంతో కలెక్టర్‌కు కోపం నసాలానికి ఎక్కింది.
మీ పిల్లలకు మీరు చెప్పేఅరకొర చదువులు పనికిరావు, అందుకుని వారిని కార్పొరేట్ స్కూళ్లలో చదివిస్తూ, ఇక్కడి పిల్లలకు చదువు చెప్పకుండా బలిచేస్తున్నారా, ’ అని ఆగ్రహంతో వూగిపోయారు. కనీసం అక్షరాలు నేర్పాల్సిన బాధ్యత లేదా అని నిలదీశారు.
ఈ టీచర్లు ఎలాంటి చదువు నేర్పిస్తున్నారో కలెక్టర్ అర్థమయింది. వెంటనే హెడ్ మాస్టర్ భానుప్రకాశ్‌తో పాటు మరో నలుగురు టీచర్లను అక్కడికక్కడే సస్పెండ్ చేసే వెళ్లిపోయారు.
ఈ స్కూలు దారిలో వెళితే బంగారు తెలంగాణా వస్తుందా...
