Asianet News TeluguAsianet News Telugu

ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ సతీమణికి ప్రసవం.. అభినందనలు తెలిపిన ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు

భదాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్‌ (Collector Anudeep) భార్య మాధవికి.. భద్రాచలం ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో (government hospital) ప్రసవం జరిగింది. దీంతో కలెక్టర్‌పై జిల్లా ప్రజలతో పాటు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) కూడా కలెక్టర్ దంపతులకు అభినందనలు తెలిపారు. 

Collector Anudeep wife madhavi gives birth at government hospital Minister Harish Rao congratulates the couple
Author
Hyderabad, First Published Nov 10, 2021, 12:50 PM IST

గతంలో ప్రభుత్వాస్రతికి వెళ్లాలంటే చాలా మంది భయపడే పరిస్థితి ఉంది. కానీ పరిస్థితుల్లో మార్పులు రావడంతో.. తెలంగాణలో ఇప్పుడు ప్రసవం కోసం ప్రభుత్వా ఆస్పత్రులకు వెళ్లేవారి సంఖ్య పెరిగింది. ప్రభుత్వ అధికారులు కూడా ప్రజలను ప్రభుత్వ ఆస్పత్రుల వైపు తీసుకొచ్చేలా చర్యలు, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులు ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకాన్ని పెంచుతున్నారు. ఇటీవల ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ స్నేహలత ప్రభుత్వ ఆస్పత్రిలో పురుడు పోసుకున్న విషయం తెలిసిందే.  జిల్లా స్థాయి అధికారి అయినప్పటికీ ఆమె సర్కారు ఆస్పత్రిలో గతనెల 21న ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

తాజాగా భదాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్‌ (Collector Anudeep) భార్య మాధవికి.. భద్రాచలం ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో (government hospital) ప్రసవం జరిగింది. కలెక్టర్ భార్యను ప్రసవం కోసం మంగళవారం అర్ధరాత్రి సమయంలో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ వైద్యులు ఆమెకు అవసరమైన పరీక్షలు నిర్వహించారు. రాత్రి ఒంటి గంట సమయంలో ఆమెకు సిజేరియన్ ‌చేయగా.. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. జిల్లా కలెక్టర్ అయివుండి తన భార్యకు ప్రభుత్వ హాస్పిటల్లో చేర్చిన అనుదీప్ పై భద్రాద్రి జిల్లా ప్రజలతో పాటు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు కూడా కలెక్టర్ దంపతులను అభినందనలు తెలిపారు. తల్లి, బిడ్డ ఇద్దరూ బాగానే ఉన్నారని ఆశిస్తున్నట్టుగా చెప్పారు.ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 

Also read: భద్రాచలం: ప్రభుత్వం దవాఖానాలో కలెక్టర్ భార్య ప్రసవం... ఆదర్శంగా నిలిచిన ఆల్ ఇండియా టాపర్

సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ప్రభుత్వ దవాఖానలు అధునాతన సౌకర్యాలతో మెరుగైన సేవలు అందిస్తున్నాయని మంత్రి తెలిపారు. దీంతో ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులు వైపు మొగ్గుచూపడం తమకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. ఇందుకు నిదర్శనం కలెక్టర్‌ దంపతులేనని మంత్రి ప్రశంసించారు.

 

ఉమ్మడి కరీంనగర్ జిల్లా మెట్ పల్లికి చెందిన ఆనుదీప్ దురిశెట్టి 2017 సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఆల్ ఇండియా టాపర్ గా నిలిచారు. శిక్షణ  పూర్తయిన తర్వాత ఆయనకు సొంత రాష్ట్రం తెలంగాణలోనే పోస్టింగ్ లభించింది. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న ఆయన భార్యను ప్రభుత్వం హాస్పిటల్లో ప్రసవం చేయింది అందరికీ ఆదర్శంగా నిలిచారు.

Follow Us:
Download App:
  • android
  • ios