చైనా సైనికుల దాడిలో మరణించిన కల్నల్ సంతోష్ బాబుకు  కేంద్ర ప్రభుత్వం  మహావీర్ చక్రను ప్రదానం చేయనుంది. రిపబ్లిక్ డే వేడుకల్లో ఈ అవార్డును కేంద్రం ప్రదానం చేస్తోంది.

హైదరాబాద్: చైనా సైనికుల దాడిలో మరణించిన కల్నల్ సంతోష్ బాబుకు కేంద్ర ప్రభుత్వం మహావీర్ చక్రను ప్రదానం చేయనుంది. రిపబ్లిక్ డే వేడుకల్లో ఈ అవార్డును కేంద్రం ప్రదానం చేస్తోంది.

గత ఏడాది జూన్ మాసంలో గాల్వన్ లోయలో చైనా ఆర్మీకి భారత సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.ఈ ఘర్షణలో సంతోష్ బాబు గాయపడ్డారు. సంతోష్ బాబు చైనా ఆర్మీని భారత భూభాగంలోకి రాకుండా నిరోధించాడు.

సంతోష్ బాబు స్వస్థలం సూర్యాపేట జిల్లా కేంద్రం. సంతోష్ బాబు భార్యకు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది. అంతేకాదు హైద్రాబాద్ లో ఇంటి స్థలం కేటాయించింది.సంతోష్ బాబు తో పాటు మరణించిన ఇతర సైనికులకు కూడ కేంద్రం పురస్కారాలను ప్రకటించింది. సంతోష్ బాబుతో పాటు 19 మంది ఆర్మీ జవాన్లు ఈ ఘటనలో మరణించారు.

బీహార్ లోని 16 రెజిమెంట్ లో కల్నల్ సంతోష్ బాబు పనిచేస్తున్నాడు. విధుల నిర్వహణ నిమిత్తం ఆయన గాల్వన్ లోయలో విధులు నిర్వహిస్తున్న సమయంలో చైనా ఆర్మీతో చోటు చేసుకొన్న ఘర్షణలో మరణించాడు.