Asianet News TeluguAsianet News Telugu

Revanth Reddy: బ్లాక్ కలర్ ల్యాండ్ క్రూయిజర్లతో సీఎం కాన్వాయ్.. సెక్యూరిటీలోనూ మార్పులు

సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ మారిపోయింది. వైట్ కలర్ నుంచి బ్లాక్ కలర్‌లోకి మారింది. బ్లాక్ కలర్ ల్యాండ్ క్రూయిజర్లతో సీఎం కాన్వాయ్ ఈ నెల 24వ తేదీన కొత్తగా దర్శనమిచ్చింది. దీనికితోడు ఆయన సెక్యూరిటీలోనూ మార్పులు జరిగాయి.
 

cm revanth reddy convoy changed into black color, land cruisers kms
Author
First Published Jan 24, 2024, 7:51 PM IST | Last Updated Jan 24, 2024, 7:51 PM IST

CM Convoy: రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే సచివాలయంలో కొత్త కాన్వాయ్‌ను అధికారులు సిద్ధం చేశారు. అప్పటి వరకు సీఎంకు నలుపు రంగు కార్లతో కాన్వాయ్ ఉండగా.. సీఎం రేవంత్ రెడ్డి కోసం అన్ని తెలుపు రంగు కార్లతో కాన్వాయ్ సిద్ధం చేశారు. కానీ, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ మళ్లీ నలుపు రంగు కార్లతో నిండింది. అదీ ల్యాండ్ క్రూయిజర్ కార్లతో సీఎం కాన్వాయ్ ఉండటం గమనార్హం. ఈ ల్యాండ్ క్రూయిజర్లు అన్నీ కూడా కేసీఆర్ హయాంలో కొనుగోలు చేసినవే.

రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి అక్కడి నుంచి అటే దావోస్, లండన్‌లలో పర్యటించిన సంగతి తెలిసిందే. అనంతరం, ఆయన రాష్ట్రానికి తిరిగి వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత కాన్వాయ్, సెక్యూరిటీ విషయంలో కీలక మార్పులు జరిగాయి. 24వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ నలుపు రంగులోకి మారడమే కాదు, ఆయన సెక్యూరిటీలోనూ మార్పులు జరిగాయి. ఇంటెలిజెన్స్ విభాగం సూచనల మేరకు ఆయన చుట్టూ ఉన్న అధికారులు, సిబ్బందిలో మార్పులు జరిగాయి. గత సీఎం వద్ద పని చేసిన సిబ్బందిని మొత్తంగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు.

Also Read : అయోధ్య రామ మందిరానికి మార్చి వరకు వెళ్లొద్దు: కేంద్రమంత్రులకు ప్రధాని విజ్ఞప్తి

సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత సమాచారంతోపాటు అధికారిక సమాచారం, ప్రభుత్వ సమాచారం కూడా బయటికి లీక్ అవుతున్నదని ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా తెలిసింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios