Asianet News TeluguAsianet News Telugu

రేపు జనగామకు కేసీఆర్... 5వేల మంది రైతులతో సమావేశం..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం జనగామలో పర్యటించనున్నారు. జనగామ జిల్లాలోని  కొడకండ్లకు శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకుహెలీక్యాప్టర్‌ లో కేసీఆర్‌ కొడకండ్ల చేరుకుంటారు. నిర్మాణం పూర్తయిన రైతు వేదికను ప్రారంభిస్తారు. ఆ తర్వాత స్థానిక వ్యవసాయ మార్కెట్‌ ఆవరణలో సుమారు 5 వేల మంది రైతులతో ఏర్పాటుచేసే సభలో కేసీఆర్‌ మాట్లాడతారు. 

CM KCR Visits Jangaon On Saturday 31st October - bsb
Author
Hyderabad, First Published Oct 30, 2020, 12:19 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం జనగామలో పర్యటించనున్నారు. జనగామ జిల్లాలోని  కొడకండ్లకు శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకుహెలీక్యాప్టర్‌ లో కేసీఆర్‌ కొడకండ్ల చేరుకుంటారు. నిర్మాణం పూర్తయిన రైతు వేదికను ప్రారంభిస్తారు. ఆ తర్వాత స్థానిక వ్యవసాయ మార్కెట్‌ ఆవరణలో సుమారు 5 వేల మంది రైతులతో ఏర్పాటుచేసే సభలో కేసీఆర్‌ మాట్లాడతారు. 

ఈ సందర్భంగా రైతు వేదికల ముఖ్య ఉద్దేశాలను ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి హాజరయ్యే రైతు బంధు జిల్లా, మండల, గ్రామ కమిటీల సభ్యులతో పాటు రైతులకు, తద్వారా రాష్ట్రంలోని రైతాంగానికి సీఎం వివరించనున్నారు. ఈ పర్యటనలో సీఎం వెంట రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. 

కొడకండ్లకు సీఎం కేసీఆర్‌ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గురువారం పరిశీలించారు. స్వయంగా సీఎం కేసీఆర్‌ మంత్రి ఎర్రబెల్లికి ఫోన్‌ చేసి కొడకండ్లకు వస్తున్న సమాచారాన్ని తెలియజేశారు. అప్పటికే వరంగల్‌ పర్యటనలో ఉన్న మంత్రి దయాకర్‌రావు వెంటనే కొడకండ్లకు చేరుకున్నారు.

సీఎం ప్రారంభించనున్న రైతు వేదిక నిర్మాణం, పల్లె ప్రకృతి వనం, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, వ్యవసాయ మార్కెట్‌లోని సభాస్థలి, హెలీప్యాడ్‌ నిర్మాణాలను పరిశీలించారు. యుద్ధప్రాతిపదికన పెండింగ్‌ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. సూచించారు. ఇదిలా ఉండగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటించాలని ముఖ్యమంత్రిని కోరడంతో, అధికారులతో నివేదిక తెప్పించుకుని జనగామ జిల్లా కొడకండ్లకు రావాల ని నిర్ణయించుకోవడం అదష్టంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు పేర్కొన్నారు. 
 
Follow Us:
Download App:
  • android
  • ios