Asianet News TeluguAsianet News Telugu

సోమవారం కల్నల్ సంతోష్ కుటుంబాన్ని పరామర్శించనున్న కేసీఆర్

ల్నల్ సంతోష్ బాబు ఇంటికి మంత్రి జగదీశ్ రెడ్డి వచ్చారు. కుటుంబాన్ని పరామర్శిస్తూ.... ఎల్లుండి  సోమవారం రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నట్టుగా తెలిపారు. 

CM KCR TO Pay Visit To Colonel Santosh Babu's Family On Monday
Author
Suryapet, First Published Jun 20, 2020, 5:25 PM IST

భారత్- చైనా సరిహద్దులో చైనా దురాగతానికి కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. యావత్ దేశమే ఇంకా ఆ ఘటనను మార్వలేకపోతుంటే... ఆ కుటుంబాల పరిస్థితి ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు. 

నేడు కల్నల్ సంతోష్ బాబు ఇంటికి మంత్రి జగదీశ్ రెడ్డి వచ్చారు. కుటుంబాన్ని పరామర్శిస్తూ.... ఎల్లుండి  సోమవారం రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నట్టుగా తెలిపారు. 

కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి హైదరాబాద్ లో 600 గజాల ఇంటి స్థలాన్ని కూడా ప్రభుత్వం కేటాయిస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇకపోతే స్వయంగా థానే ప్రకటించిన 5 కోట్ల రూపాయల చెక్కును తీసుకొని సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శిస్తాను అని నిన్న చెప్పిన విషయం తెలిసిందే. 

ఇకపోతే... మరణించిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిన్న ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం తరుఫున సహాయం ప్రకటించారు. సంతోష్ బాబు కుటుంబానికి రూ.5 కోట్ల నగదు, నివాస స్థలం, ఆయన భార్యకు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తానే స్వయంగా సంతోష్ బాబు ఇంటికి వెళ్లి సహాయం అందించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. 

ఇదే ఘర్షణలో మరణించిన మిగతా 19 మంది సైనికుల కుటుంబ సభ్యులకు కూడా ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తరుఫున సాయం చేయనున్నట్లు కేసీఆర్ తెలిపారు.  కేంద్ర రక్షణ మంత్రి ద్వారా ఈ సాయాన్ని బాధిత కుటుంబాలకు అందిస్తామని సిఎం వెల్లడించారు. 

''సరిహద్దుల్లో దేశ రక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సైనికులకు యావత్ దేశం అండగా నిలవాలి. వీర మరణం పొందిన సైనికుల కుటుంబాలను ఆదుకోవాలి. తద్వారా సైనికుల్లో ఆత్మ విశ్వాసం, వారి కుటుంబాల్లో భరోసా నింపాలి. దేశమంతా మీ వెంటనే ఉందనే సందేశం అందించాలి'' అని అన్నారు.  

''వీర మరణం పొందిన సైనికులకు కేంద్ర ప్రభుత్వం ఎలాగూ సాయం చేస్తుంది. కానీ రాష్ట్రాలు కూడా సహాయ సహకారాలు అందించాలి. అప్పుడే సైనికులకు, వారి కుటుంబాలకు దేశం మా వెంట నిలుస్తుందనే నమ్మకం కుదురుతుంది. సింబల్ ఆఫ్ యూనిటీ ప్రదర్శించాలి. కరోనాతో ఆర్థిక ఇబ్బుందులున్నప్పటికీ మిగతా ఖర్చులు తగ్గించుకుని అయినా సైనికుల సంక్షేమానికి పాటు పడాలి'' అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడి నిర్వహించిన అఖిలపక్ష సమావేశం సందర్భంగా చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios