Asianet News TeluguAsianet News Telugu

మరో 28 మందికి బీ ఫారాలు అందించిన గులాబీ బాస్ .. మిగితా వారికి ఎప్పుడివ్వనున్నరంటే..?

BRS Bforms: ఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సోమవారం మరికొంతమంది బీ ఫారాలు అందుకున్నారు.  

CM KCR to Given B-Forms to 28 MLA Candidates KRJ
Author
First Published Oct 17, 2023, 5:07 AM IST

BRS Bforms:  బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ సోమవారం 28 మంది అభ్యర్థులకు బి ఫారాలు అందజేశారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలు కాగా.. అందులో ఇప్పటి వరకు  97 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు బి ఫారాలు అందుకున్నారు. ఈ క్రమంలో మరో 25 స్థానాల అభ్యర్థులకు మాత్రమే బీఫామ్స్ పెండింగ్ ఉన్నాయి.

తొలుత ఆదివారం నాడు తొలి విడతలో 51 మందికి బీఫామ్ ఇవ్వగా.. మరో 18 మందికి రెండో విడుదతలో బీఫాం ఇచ్చారు. తాజాగా సోమవారం సాయంత్రం మరో 28 మందికి బీఫాంలను అందజేశారు. అయితే కేసీఆర్  బీఫాంతో పాటు ఎన్నికల ఖర్చుల కోసం చెక్కులు ఇస్తున్నారు.  అన్ని పత్రాలతో పక్కాగా ఉండేలా బీఫామ్స్ రెడీ చేస్తున్నారు. అందుకే సిద్ధమైన వారందరికీ  బీఫామ్స్ ఇస్తున్నారు. కానీ.. బీఫాం రాని వాళ్లు టెన్షన్ పడుతున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో అందరికీ బీఫామ్ లు ఇచ్చే అవకాశముంది.  మరోవైపు.. రాకపోవడంతో తమకు టిక్కెట్ నిరాకరించబోతున్నారనే అనే సందేశం అటు అభ్యర్థుల్లోనూ.. ఇటు కార్యకర్తల్లో నెలకొంది.  
 
నిన్న  బీ ఫారాలు అందుకున్న అభ్యర్ధులు వీరే..

1. సంజయ్ కల్వకుంట్ల
2. డా. ఎన్ . సంజయ్ కుమార్
3. కొప్పుల ఈశ్వర్
4. కోరుకంటి చందర్
5. పుట్ట మథు
6. చింత ప్రభాకర్
7. చామకూర మల్లారెడ్డి
8. కె పి వివేకానంద్
9. మాధవరం కృష్ణారావు
10. మంచికంటి కిషన్ రెడ్డి
11. సబితా ఇంద్రారెడ్డి
12. టి. ప్రకాశ్ గౌడ్
13. కాలె యాదయ్య
14. కొప్పుల మహేశ్ రెడ్డి
15. మెతుకు ఆనంద్
16. ముఠా గోపాల్
17. కాలేరు వెంకటేశ్
18. దానం నాగేందర్
19. మాగంటి గోపీనాథ్
20. టి. పద్మారావు
21. లాస్య నందిత
22. గొంగిడి సునీత
23. శానంపూడి సైదిరెడ్డి
24. డి.ఎస్.రెడ్యానాయక్
25. బానోత్ శంకర్ నాయక్
26. చల్లా ధర్మారెడ్డి
27. ఆరూరి రమేశ్
28. గండ్ర వెంకట రమణారెడ్డి

 

Follow Us:
Download App:
  • android
  • ios