Asianet News TeluguAsianet News Telugu

కేంద్రంలో టీఆర్ఎస్‌కి అవకాశం రావొచ్చు: తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలనం

రాజకీయాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. కేంద్రాన్ని శాసించే అవకాశం రావొచ్చు, లేదా కేంద్రంలో పాత్ర దొరికే అవకాశం రావొచ్చని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

CM KCR sensational comments in Telangana Assembly
Author
Hyderabad, First Published Oct 5, 2021, 4:25 PM IST

హైదరాబాద్: రాజకీయాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు.. రేపు కేంద్రాన్ని శాసించే అవకాశం టీఆర్ఎస్‌కి రావొచ్చని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.

మంగళవారం నాడు తెలంగాణ అసెంబ్లీలో dalitha bandhu పథకంపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.  కేంద్రంలో టీఆర్ఎస్ కు పాత్ర దొరికే అవకాశం రావచ్చని ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.

also read:మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి: తెలంగాణ అసెంబ్లీలో మల్లు భట్టి విక్రమార్క

కేంద్రానికి పెద్ద ఎత్తున ధరఖాస్తులు అందిస్తామని ఆయన చెప్పారు.  దళిత బంధు పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకొంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. రానున్న రెండు మూడు నెలల్లో ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభం కానుందని  kcr చెప్పారు.

రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ పోషించిన పాత్రను కేసీఆర్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. రాష్ట్రాల ఏర్పాటు చేసే అవకాశం పార్లమెంట్ కు ఉండాలని అంబేద్కర్ చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.అణచివేతకు గురైన వర్గాలకు ఇప్పటికీ సాధికారిత చేకూరలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  గతంలో ఉన్న ప్రభుత్వాలు  కొంత చేశాయని ఆయన తెలిపారు.

1986లోనే దళితబంధుకు రూపకల్పన 

దళిత బంధు హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం తీసుకొచ్చింది కాదని  కేసీఆర్ తేల్చి చెప్పారు.  కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దళితుల పరిస్థితి దయనీయంగా ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

దళితుల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని ఆయన ఆవేదన  చెందారు.1986లోనే ఈ పథకం పురుడుపోసుకుందని కేసీఆర్ ఆయన గుర్తు చేసుకొన్నారు.తాను సిద్దిిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే దళిత జ్యోతి కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ఏడాదిగా  కసరత్తు చేస్తున్నామని  సీఎం తెలిపారు.

దళిత కుటుంబానికి ఇచ్చే రూ. 10 లక్షలతో ఒక గ్రూప్ ను ఏర్పాటు చేసి పెద్ద పెద్ద పరిశ్రమలను ఏర్పాటు చేయవచ్చన్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఈ గ్రూప్ ల ఏర్పాటు విషయంలో చొరవ తీసుకోవాలని సీఎం కేసీఆర్ కోరారు.

దళితుల కోసం ఒక్కో నియోజకవర్గంలో రూ. 4 వేల కోట్లతో రక్షణ నిధిని కూడా ఏర్పాటు చేస్తామని  చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసం అబద్దాలు ఆడుతామా అని  కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఒక్క ఎకరం అమ్మితే ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో ఆరు ఎకరాలను కొనుగోలు చేసే పరిస్థితి ఉందని సీఎం చెప్పారు. ఉచిత విద్యుత్ తో రైతులకు భరోసా ఇచ్చామని కేసీఆర్ తెలిపారు.పాలమూరు జిల్లా నుండి గతంలో లక్షల మంది వలసలు వెళ్లారని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రాజెక్టుల నిర్మాణంతో వలస వెళ్లిన ప్రజలంతా తిరిగి జిల్లాకు వస్తున్నారని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.


 


 

Follow Us:
Download App:
  • android
  • ios