Asianet News TeluguAsianet News Telugu

మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి: తెలంగాణ అసెంబ్లీలో మల్లు భట్టి విక్రమార్క

మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లను అమలు చేసి వారికి నమ్మకం కల్గించాలని తెలంగాణ  అసెంబ్లీలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కేసీఆర్ ను కోరారు. సోమవారం నాడు తెలంగాణ అసెంబ్లీలో ఆయన  ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

CLP leader Mallu Bhatti Vikra marka demands to implement 12 percent reservations
Author
Hyderabad, First Published Oct 4, 2021, 4:33 PM IST

హైదరాబాద్: మైనార్టీలకు(minority) 12 శాతం రిజర్వేషన్లు (12 percent reservation) ఇస్తామని కేసీఆర్ (kcr) ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ అమలు చేయాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క (mallu bhatti vikramarka)డిమాండ్ చేశారు.

తెలంగాణ అసెంబ్లీలో (telangana Assembly)సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. ఎన్నికల సమయంలో 12 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని ఆయన కేసీఆర్ ను కోరారు. 12 శాతం రిజర్వేషన్ ఇచ్చి మైనార్టీలకు కేసీఆర్ నమ్మకం కల్గించాలని ఆయన కోరారు. అందరికీ ఉచితంగా విద్యను అందించి  సమాన అవకాశాలను కల్పించాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కోరారు.రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హమీలను  అమలు చేయాలని ఆయన కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలపై  అసెంబ్లీ వేదికగా  ఎండగట్టాలని సీఎల్పీ నిర్ణయం తీసుకొంది. ప్రాజెక్టులు, దళితబంధుతో పాటు ఇతర కార్యక్రమాలపై అసెంబ్లీలో చర్చకు  సీఎల్పి పట్టుబట్టాలని  భావిస్తోంది. మరో వైపు  ఎన్ని రోజులైనా సభను నిర్వహించేందుకు ప్రభుత్వం కూడ సిద్దంగా ఉందని  బీఏసీ సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

 

 


 

Follow Us:
Download App:
  • android
  • ios