నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో హాలియాలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఉప ఎన్నిక ప్రచారానికి చివరి రోజయిన ఇవాళ(బుధవారం) టీఆర్ఎస్ పార్టీ హాలియాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది.

ఈ సభలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి, సీనియర్ నేత జానారెడ్డిపై విమర్శలు ఎక్కు పెట్టారు. జానారెడ్డి నాగార్జున సాగర్ కు చేసింది ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో పేదలను పట్టించుకోలేదని తెలిపారు.

నోముల భగత్ కు ఏ విధంగా ఓట్లు పడతాయో అదే విధంగా నెల్లికల్లు లిఫ్ట్ నీళ్లు కూడా దూకుతాయని కేసీఆర్ హామీ ఇచ్చారు. నాగార్జున సాగర్‌కు డిగ్రీ కాలేజీని మంజూరు చేస్తామని చెప్పారు. 

తెలంగాణ ప్రజలు నాకు ముఖ్యమంత్రి పదవి భిక్ష పెట్టారు. జానారెడ్డి కాదు.. తెలంగాణ ఉద్యమంలో పదవులు గడ్డిపోచల్లాంటివని వదిలేశాం. పదవుల కోసం తెలంగాణను వదిలిపెట్టింది కాంగ్రెస్. 

తెలంగాణ కోసం చాలాసార్లు రాజీనామాలు చేశాం. ఓటువేసే ముందు న్యాయం ఎవరివైపు ఉందో ఆలోచించాలి. నాగార్జునసాగర్ లో సంక్షేమ పథకాలు అందడం లేదా? పైరవీలు లేకుండా పాలన సాగిస్తున్నాం.. అని కేసీఆర్ అన్నారు.