ప్రజలకు సీఎం కేసీఆర్ సూచన
పెద్ద నోట్ల రద్దు సమస్యను అధిగమించేందుకు రాష్ట్రంలోని ప్రజలందరూ క్యాష్ లెస్ కు మారాలని సీఎం కేసీఆర్ సూచించారు.
నోట్ల రద్దు తర్వాత రాష్ట్రంలో ఆర్థికలావాదేవీలు తగ్గుముఖం పట్టాయని అభిప్రాయపడ్డారు.
ప్రజలకు బ్యాంకులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఐసీఐసీఐ బ్యాంకు అధికారులతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఆర్థిక లావాదేవీల సమస్యలను అధిగమించేందుకు డిజిటల్ విధానాన్ని తక్షణం అమలు చేయాలని సూచించారు.
నగదు రహిత లావాదేవీల కోసం అందరినీ సమాయత్తం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
