Asianet News TeluguAsianet News Telugu

స్వచ్ఛభారత్ సర్వేక్షణ్‌లో నెంబర్‌వన్‌గా తెలంగాణ.. ఇలాగే సాగుదాం , అధికారులకు కేసీఆర్ అభినందనలు

స్వచ్ఛభారత్ సర్వేక్షణలో దేశంలోనే తెలంగాణ నెంబర్‌వన్‌గా నిలవడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పల్లె ప్రగతిని సమర్ధవంతంగా అమలు చేస్తోన్న అధికారులను సీఎం ఈ సందర్భంగా అభినందించారు

cm kcr praised officials over telangana tops swachh sarvekshan gramin rankings
Author
First Published Sep 23, 2022, 9:32 PM IST

స్వచ్ఛభారత్ సర్వేక్షణలో దేశంలోనే తెలంగాణ నెంబర్‌వన్‌గా నిలిచిందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు ఇది నిదర్శనమని సీఎం అన్నారు. గ్రామీణ స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా తెలంగాణకు 13 అవార్డులు వచ్చాయని కేసీఆర్ తెలిపారు. పల్లె ప్రగతిని సమర్ధవంతంగా అమలు చేస్తోన్న అధికారులను సీఎం ఈ సందర్భంగా అభినందించారు. రాష్ట్రం దేశ ప్రగతిలో తనవంతు గుణాత్మక భాగస్వామ్యం పంచుకోవడం ప్రతీ తెలంగాణ బిడ్డా గర్వించాల్సిన సందర్భమని .. రాబోయే రోజుల్లో ఇదే పరంపరను కొనసాగిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. 

కాగా..  'స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్' ర్యాంకింగ్స్‌లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 'స్వచ్ఛ్ భారత్ మిషన్' దివస్ 2022 కింద తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 13 అవార్డులను అందజేసింది. ఎస్‌ఎస్‌జీ సౌత్ జోన్ ర్యాంకింగ్స్‌లో నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ (SSG) ర్యాంకింగ్స్‌తో పాటు, రాష్ట్రం, దాని వివిధ జిల్లాలు వివిధ విభాగాలలో ఉన్నత ర్యాంక్‌ల ద్వారా మరో పది విభిన్న అవార్డులను గెలుచుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం.. సుజలం క్యాంపెయిన్,  జాతీయ చలనచిత్ర పోటీలు, వాల్ పెయింటింగ్ సహా పలు పోటీలలో ఇతర అవార్డులను గెలుచుకుంది.

ALso REad:'స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్' ర్యాంకింగ్స్‌.. దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ

రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ట్విట్టర్ లో ఈ విజయాల జాబితాను పోస్ట్ చేశారు.తెలంగాణ కీర్తి కిరీటంలో మరిన్ని విజయాలు అంటూ పోస్ట్ చేసిన ఆయన.. SBM కార్యక్రమం కింద భారతదేశం అంతటా నెం.1 రాష్ట్రం సహా 13 అవార్డులను తెలంగాణ పొందినందుకు గర్వంగా ఉంది. జీపీలు, డిపార్ట్ మెంట్ లకు నిరంతరం మద్దతు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు అని ఆయన ట్వీట్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios