మీది పక్కా వాస్తు.. మాకు రోజంతా పస్తు

cm kcr new house with vasthu
Highlights

వాస్తు పేరుతో కోట్లు తగిలేస్తున్న సీఎం

విద్యార్థుల మెస్ బిల్లులకు మాత్రం డబ్బులు లేవు

మండిపడుతున్న విద్యార్థి సంఘాలు

 

బంగారు తెలంగాణ నిర్మిస్తాం.. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తామని ‘కారు’ స్పీడ్లో హామీలిచ్చి గద్దెనెక్కిన టిఆర్ఎస్ ప్రభుత్వం  రెండున్నరేళ్ల పాలనలో నిజంగా వారి కోసం ఏం చేసింది.

 

ఒక వైపు జనాలు పెద్ద నోట్ల రద్దుతో నానా కష్టాలు పడుతున్న వేళ... ఫీజు రి యింబర్స్ మెంట్ చెల్లించక విద్యార్థులు తరగతులకు దూరమౌతున్న వేళ సీఎం కేసీఆర్ మాత్రం పక్కా వాస్తుతో కోట్ల రూపాయిల వెచ్చించి ఇళ్లు నిర్మించుకున్నారు.

 

ఇది చాలదన్నట్లు సచివాలయం కూడా కూలగొట్టి పక్కా వాస్తుతో నిర్మించేందుకు కోట్ల రూపాయిలతో ఖర్చు చేసి నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

 

మన నీళ్లు, నిధులు, నియామకాలు దోచుకుంటున్నారంటూ విద్యార్థుల్లో విప్లవ భావాలు రగిలించిన ఉద్యమ నేత అధికారం చేపట్టాక వాస్తు పేరుతో కోట్లు తగిలేస్తూ తమను పస్తులుంచడం ఎంతవరకు సబబు అని ఇప్పుడు విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.

 

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన ఉస్మానియా యూనివర్సిటీ ఇప్పుడు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. బోధన సిబ్బంది లేరు. మౌలిక వసతులు అసలే లేవు. కోట్ల రూపాయిలు మెస్ బిల్లులు బకాయిలు పేరుకపోయాయి. వీటిని చెల్లించాల్సిన ప్రభుత్వం లైట్ తీసుకుంటుంది.

 

ఇక లక్షల మంది విద్యార్థులతో ముడిపడి ఉన్న ఫీజు రి యింబర్స్ మెంట్ పై సర్కార్ స్పందించడటమే లేదు.

 

రూ. 2 వేల కోట్ల వరకు బకాయిలు పేరుకపోయి... కాలేజ్ లలోకి విద్యార్థులను అనుమతించడటమే లేదు.

 

ఇలా మెస్ బిల్లులు కట్ట లేక విద్యార్థులు పస్తులుంటే... సీఎం కేసీఆర్ మాత్రం పక్కా వాస్తు చూసుకొని కోట్ల రూపాయిలతో ఇళ్లు నిర్మించడం అది కూడా ప్రభుత్వ సొమ్ముతో దుబారా ఖర్చులు చేస్తుండడంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.

 

 

loader