బెజవాడ కనకదుర్గమ్మ, తిరుమల వెంకన్నను సందర్శించుకునేందుకు ఈ నెల 30న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ కు వెళ్లనున్నారు.  

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 30 న ఆంధ్రప్రదేశ్ కు వెళ్లనున్నట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బెజవాడ కనకదుర్గమ్మకు, తిరుమల వేంకటేశ్వరస్వామికి కానుకలు సమర్పిస్తానని కేసీఆర్ మొక్కుకున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో తన మొక్కులు తీర్చుకునేందుకు ఆయన ఈ రెండు దేవాలయాలకు వెళ్లనున్నారు.

తిరుమల శ్రీవారికి రూ.5. 5 కోట్లతో ప్రత్యేకంగా తయారు చేసిన కిరీటం, ఇతర అభరణాలు సమర్పిస్తారు. 14.9 కిలోల సాలిగ్రామ హారాన్ని, 4.650 కిలోల ఐదు పేటల కంఠాభరణాన్ని స్వామి వారి కోసం కేసీఆర్ ప్రత్యేకంగా తయారు చేయించిన విషయం తెలిసింది.

అలాగే, విజయవాడ కనకదుర్గ అమ్మవారికి 15 గ్రాములతో ముక్కు పుడకను కూడా సమర్పిస్తారు.

మొదట తిరుమల చేరుకొని అక్కడ కానుకలు సమర్పించాక నేరుగా విజయవాడ చేరుకుంటారు. అక్కడ కనకదుర్గమ్మ దర్శన అనంతరం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తో సమావేశం అవుతారు.