Asianet News TeluguAsianet News Telugu

చెత్త ఊడ్చితే రూ.14 వేలు..కార్మికులకు సీఎం బంపర్ ఆఫర్

ఇప్పుడు మరోసారి రూ.1500 పెంచి, మొత్తం జీతాన్ని రూ.14,000 చేశారు.

cm kcr hike ghmc employees salaries again

జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులకు శుభవార్త. వారి  వేతనాలు భారీగా పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

 

గతంలోనే వారి వేతనాన్ని ఒకసారి పెంచిన సీఎం ఇప్పుడు తాజాగా మరో రూ.1500 పెంచారు.

 

మంగళవారం ప్రగతి భవన్లో పారిశుద్య కార్మికుల వేతనాల పెంపుకు సంబంధించి ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

 

పారిశుద్య కార్మికుల వేతనాలను రూ.1500 మేర పెంచాలని నిర్ణయించారు. తెలంగాణ వచ్చే నాటికి పారిశుద్య కార్మికుల వేతనం రూ.8,500 ఉండేది. గతంలో సిఎం కేసీఆర్ వారి వేతనాన్ని రూ.12,500 కు పెంచారు.

 

ఇప్పుడు మరోసారి రూ.1500 పెంచి, మొత్తం జీతాన్ని రూ.14,000 చేశారు. రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల నుంచి కూడా కార్మికుల వేతనాల పెంపు అంశం కూడా చర్చకు వచ్చింది.

 

దీనికి కూడా ముఖ్యమంత్రి సానుకూలత వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో కార్మికుల వేతనాలు జిహెచ్ఎంసి భరిస్తున్నదని సిఎం చెప్పారు.

 

ఆయా మున్సిపాలిటీలలో కూడా ఆర్థిక పరిస్థితి, పన్నుల వసూళ్ల వివరాలు తీసుకోవాల్సిందిగా మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ను సిఎం ఆదేశించారు.

Follow Us:
Download App:
  • android
  • ios