Asianet News TeluguAsianet News Telugu

రోడ్డు పక్కన దాబాలో టీ తాగిన సీఎం కేసీఆర్.. నేతలతో ముచ్చట్లు

సీఎం కేసీఆర్ సిద్దిపేట బహిరంగ సభలో మాట్లాడి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు. దారి మధ్యలో ఆగి రోడ్డు పక్కనే ఉన్న దాబాలోకి వెళ్లి టీ తాగారు. ఆయన వెంటనే బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా ఉన్నారు.
 

cm kcr had tea in dhaba while going to hyderabad from siddipet along with senior leaders kms
Author
First Published Oct 17, 2023, 8:58 PM IST | Last Updated Oct 17, 2023, 8:58 PM IST

సిద్దిపేట: సీఎం కేసీఆర్ ఈ రోజు సిరిసిల్ల, సిద్దిపేటలో నిర్వహించిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఐటీ మంత్రి, కొడుకు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో ప్రసంగించిన తర్వాత వైద్యారోగ్య శాఖ మంత్రి, మేనల్లుడు హరీశ్ రావు నియోజకవర్గం సిద్దిపేటలో మాట్లాడారు. తనయుడు కేటీఆర్, మేనల్లుడు హరీశ్ రావు వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధిని ప్రస్తావిస్తూ ఇద్దరినీ ప్రశంసించారు. 

సిద్దిపేటలో హరీశ్ రావును ఆరు అడుగుల బుల్లెట్ అంటూ ప్రశంసించి హైదరాబాద్‌కు తిరుగుపయానం అయ్యారు. హైదరాబాద్‌కు వెళ్లుతూ మార్గం మధ్యంలో సీఎం కేసీఆర్ రోడ్డు పక్కనే ఉన్న సోనీ ఫ్యామిలీ దాబాలోకి వెళ్లారు. వెంటే ఉన్న ముఖ్య నేతలతో ఆ దాబాలో కూర్చుని టీ తాగారు. ఆ తర్వాత కాసేపు ముచ్చట్లు పెట్టారు.

Also Read: హరీశ్ ఆరడుగుల బుల్లెట్ .. సిద్ధిపేటలో నేనున్నా ఇంత అభివృద్ధి అసాధ్యం : మేనల్లుడిపై కేసీఆర్ ప్రశంసలు

సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రి హరీశ్ రావు, రాజ్యసభ ఎంపీ దామోదర్ రావు, ఎంపీ, దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనా చారి, చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌లు కూడా ఉన్నారు. వీరంతా ఆ దాబాలో టీ తాగారు. కాసేపు మాట్లాడుకున్నారు. అనంతరం, హైదరాబాద్‌కు ప్రయాణాన్ని కొనసాగించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios