కేసీఆర్ పెద్దమనసు.. ఉద్యమంలో బలిదానం చేసుకున్న కానిస్టేబుల్‌ కూతురికి ఆర్థికసాయం

First Published 23, Jul 2018, 1:00 PM IST
CM KCR Gives Rs. 5 Lakh Cheque To The Constable Kistaiah Wife
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకున్న కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి అండగా నిలిచారు. కానిస్టేబుల్ తన కూతురిని డాక్టర్‌గా చూడాలనుకున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకున్న కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి అండగా నిలిచారు. కానిస్టేబుల్ తన కూతురిని డాక్టర్‌గా చూడాలనుకున్నారు. అయితే ఆయన ప్రాణత్యాగంతో ఆ కుటుంబం కష్టాల్లో పడింది. ఆర్థిక ఇబ్బందులతో అమ్మాయి చదువు సాగడం కష్టంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కానిస్టేబుల్‌ కటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయించారు. వెంటనే కానిస్టేబుల్ భార్యను ప్రగతి భవన్‌కు పిలిపించి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు.

loader