Asianet News TeluguAsianet News Telugu

డ్ర‌గ్ మాఫియా కు చెక్ పెట్టెందుకు తెలంగాణ ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు

  • డ్రగ్స్ కి చెక్  పెట్టడానికి టీఎస్ ప్రభుత్వం ప్రయత్నాలు
  • ముఖ్యమంత్రి కేసిఆర్ సోదాలకు  ఆదేశం
  • బరిలోకి దిగిన పోలీసులు
CM KCR gives orders to searching  for drugs

తెలంగాణ‌లో నెల రోజుల నుండి డ్ర‌గ్ మాఫియా ప‌లు రకాలుగా బ‌య‌టికొస్తుంది. ఇప్ప‌టికే డ్ర‌గ్ వ్యాపారుల‌ను, కొనుగొలుధారుల‌ను పోలిసుల గుర్తించారు. డ్ర‌గ్ మాఫియా ప‌డ్డ వారిలో స్కూల్ పిల్ల‌ల ద‌గ్గ‌ర నుండి సినిమా ప్ర‌ముఖ స్టార్ల వ‌ర‌కు ఈ లిస్టులో ఉన్నట్లు తెలుస్తుంది. హైద‌రాబాద్ ఏకంగా డ్ర‌గ్ కి కేరాఫ్ అడ్ర‌స్ గా మారింది. అయితే ఇప్పుడు  డ్ర‌గ్ మాఫియాను అంతం చెయ్య‌డానికి తెలంగాణ సిఏం కే చంద్ర‌శేఖ‌ర్ రావు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా ఎక్సైజ్ అధికారుల‌కు, పోలీసుల‌కు ఆదేశాలు జారీ చేశారు.


హైదరాబాద్ న‌గ‌రంలో అనుమానం ఉన్న ప్ర‌తి ప్రాంతంలో త‌నికీలు చెయ్యాల‌ని ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు అందాయి.. పబ్‌ల‌లో, బార్లలో సోధాలు నిర్వహించాల‌ని ఆదేశాలు జారీ చేశారు. మాద‌క‌ ద్ర‌వ్యాల దర్యాప్తు కేసును తీవ్రతరం చేయడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశాలు ఇచ్చిన తరువాత నగరంలోని  220 బార్లు, పబ్బులలో  సోదాలు ప్రారంభించారు అధికారులు.

 

బార్లులో, ప‌బ్‌ల‌లో డ్ర‌గ్స్‌  దొరికితే క‌ఠిన చ‌ర్య‌లు తప్ప‌వ‌ని అధికారులు అంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios