Asianet News TeluguAsianet News Telugu

సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తున్న కేసీఆర్ ... ప్రతిసారిలా కాకుండా ఈసారి కొత్తగా...

దేవుళ్ళను బాాగా నమ్మే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం సెంటిమెంట్ ను ఫాలోకావడం లేదు. నామినేషన్ రోజు తన ఇష్టదైవాన్ని పూజించేందుకు కోనాయిపల్లి వేళ్లే కేసీఆర్ ఈసారి మాత్రం అలా చేయడంలేదట. 

CM KCR Breaks sentiment in this Assembly Elections AKP
Author
First Published Nov 3, 2023, 12:30 PM IST | Last Updated Nov 3, 2023, 12:32 PM IST

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తున్నారు. కేసీఆర్ ఏ ఎన్నికల్లో పోటీచేసినా నామినేషన్ వేసేరోజు సిద్దిపేట సమీపంలోని కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈసారి సెంటిమెంట్ ప్రకారం నామినేషన్ వేసేరోజు కేసీఆర్ కోనాయిపల్లి ఆలయానికి వెళ్లడం లేదట. నామినేషన్ కు చాలా ముందుగానే అంటే రేపు(శనివారం) వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు కేసీఆర్ సిద్దమయ్యారు. 
 
రేపు ఉదయం కేసీఆర్ ముందుగా సిద్దిపేటకు వెళతారు... అక్కడినుండి కోనాయిపల్లికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి హరీష్ రావుతో పాటు బిఆర్ఎస్ ముఖ్యనాయకులు కోనాయిపల్లి వెళ్లనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం కేసీఆర్ తిరుగుపయనం కానున్నారు. 

అయితే కేసీఆర్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేస్తున్నారు. అలాగే ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. ఇలా ఎన్నికల హడావిడిలో వున్న కేసీఆర్ ఈ నెల 9న అంటే వచ్చే గురువారం నామినేషన్లు వేయనున్నారు. మొదట గజ్వేల్ లో  నామినేషన్ వేసి వెంటనే కామారెడ్డి వెళ్ళనున్నారు. అక్కడ తొందరగా నామినేషన్ ప్రక్రియ పూర్తిచేసుకుని ఎన్నికల ప్రచార సభలో పాల్గోననున్నారు. గతంలో కంటే ఈసారి ఎన్నికలు వాడీవేడిగా వుండటంతో కేసీఆర్ నామినేషన్ రోజు ప్రతిసారిలా కోనాయిపల్లి వెళ్లలేకపోతున్నారు. అందువల్లే రేపు శనివారం కావడం... తీరిక సమయం వుండటంతో ముందుగానే కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కేసీఆర్ సిద్దమయ్యారు. 

Read More  కేసీఆర్ పై 100 మంది పౌల్ట్రీ రైతుల పోటీ... కూతురు కవిత పరిస్థితే తండ్రికి తప్పదా?

సిద్దిపేట జిల్లా నంగునూరులోని కోనాయిపల్లి ఆలయం కేసీఆర్ కు బాగా సెంటిమెంట్. పోటీచేసే ప్రతి ఎన్నికలోనూ స్వామివారి ఆశీర్వాదం పొందాకే నామినేషన్ వేస్తుంటారు. 1985 లో మొదటిసారి సిద్దిపేట అసెంబ్లీ బరిలో దిగిన నాటినుండి గత ఎన్నికల వరకు ఈ సెంటిమెంట్ ను కేసీఆర్ ఫాలో అయ్యాడు. నామినేషన్ పత్రాలతో నేరుగా కోనాయిపల్లి ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించి అక్కడినుండే రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళుతుంటారు. కానీ ఈసారి మాత్రం కేసీఆర్ నేరుగా నామినేషన్ వేయడానికి వెళ్ళనున్నారు.. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios