శ్రీశ్రీ సెంటర్ నుండి సభకు భట్టి పాదయాత్ర: సీఎల్పీ నేతను సన్మానించనున్న రాహుల్

ఖమ్మం పట్టణంలోని శ్రీశ్రీ సెంటర్ నుండి ఖమ్మం  సభ వరకు  పార్టీ నేతలతో కలిసి భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభించారు. సభా వేదికపై  భట్టి విక్రమార్కను  రాహుల్ గాంధీ  సన్మానించనున్నారు.

CLP Leader  Rahul Gandhi  Starts  padayatra  From  Srisri  center in  Khammam lns

ఖమ్మం: పట్టణంలోని శ్రీశ్రీ సెంటర్ నుండి సీఎల్పీ  నేత మల్లు భట్టి విక్రమార్క  పాదయాత్ర  ఆదివారంనాడు సాయంత్రం ప్రారంభమైంది.  కాంగ్రెస్ పార్టీ  జనగర్జన  సభకు   శ్రీశ్రీ సెంటర్  రెండున్నర కిలోమీటర్ల దూరం ఉంటుంది.    శ్రీశ్రీ సెంటర్ లో  మల్లు భట్టి విక్రమార్కతో పాటు   మాజీ పీసీసీ చీఫ్  ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్ బాబు మాజీ ఎంపీ  పొన్నం ప్రభాకర్ తదితరులు  కలిసి  పాదయాత్రగా  బహిరంగ సభకు  బయలుదేరారు. 

నిన్న సాయంత్రం  ఖమ్మం డీసీసీ  కార్యాలయం నుండి  శ్రీశ్రీ సెంటర్ వరకు   మల్లు భట్టి విక్రమార్క  పాదయాత్ర  చేరుకుంది.   ఇవాళ  సాయంత్రం   శ్రీశ్రీ సెంటర్ నుండి  భట్టి విక్రమార్క  పాదయాత్ర   బహిరంగ సభకు  చేరుతుంది.  పాదయాత్రకు  సభకు  చేరుకొనే మల్లుభట్టి విక్రమార్కను  రాహుల్ గాంధీ సన్మానించనున్నారు.

ఈ ఏడాది మార్చి  16వ తేదీన  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో  భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభమైంది.  మూడు మాసాల తర్వాత  భట్టి విక్రమార్క  పాదయాత్ర  నిన్న ఖమ్మం పట్టణంలోకి  ప్రవేశించింది.   

also read:గన్నవరానికి చేరుకున్న రాహుల్: ప్రత్యేక హెలికాప్టర్ లో ఖమ్మానికి కాంగ్రెస్ నేత

109 రోజుల పాటు  1365 కిలోమీటర్ల పాటు భట్టి విక్రమార్క  పాదయాత్ర నిర్వహించారు.  ఖమ్మం సభ వేదికకు చేరుకోవడంతో పాదయాత్రను  భట్టి విక్రమార్క ముగించనున్నారు. సుదీర్ఘ పాదయాత్ర చేసిన భట్టి విక్రమార్కను  రాహుల్ గాంధీ ఖమ్మం సభలో సన్మానించారు.  మరో వైపు  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడ  పాదయాత్ర చేశారు. ఆయనను  కూడ రాహుల్ గాంధీ సన్మానిస్తారు. 

భారత్ జోడో యాత్రను  రాహుల్ గాంధీ నిర్వహించారు.  రెండో విడత భారత్ జోడో యాత్రను  నిర్వహించేందుకు  రాహుల్  ప్లాన్   చేస్తున్నారు.  భారత్ జోడో యాత్రకు  కొనసాగింపుగా  మల్లు భట్టి విక్రమార్క  పాదయాత్ర  కొనసాగించారు. భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభలోనే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  తన అనుచరులతో కలిసి  కాంగ్రెస్  పార్టీలో  చేరనున్నారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios