కవితకు అవమానం జరిగితే తెలంగాణకు జరిగినట్టా? : భట్టి విక్రమార్క

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఎంత  పెద్ద వారున్నా  వదిలిపెట్టవద్దని  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కోరారు.  

CLP Leader  Mallu Bhatti Vikramarka Serious Comments  On BRS  MLC  Kavitha


హైదరాబాద్: కవితకు అవమానం జరిగితే  తెలంగాణకు అవమానం జరిగినట్టుగా  చెప్పుకోవడం  సరైంది  కాదని  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క  చెప్పారు.గురువారంనాడు హైద్రాబాద్ లో  ఆయన మీడియాతో మాట్లాడారు.  ఢిల్లీ లిక్కర్ స్కాం  కొన్ని ప్రభుత్వాలను అతలాకుతలం  చేస్తుందన్నారు. గాంధేయవాధినంటూ  కేజ్రీవాల్ గొప్పలు చెప్పుకున్నాడన్నారు. కానీ  ఢిల్లీ లిక్కర్ స్కాం  సంగతి ఏమిటని ఆయన ప్రశ్నించారు.  ఈ విసయమై అన్నాహజారే సమాధానం చెప్పాలని  ఆయన  డిమాండ్  చేశారు. తెలంగాణ భావోద్వేగాలు  రెచ్చగొట్టే ప్రయత్నం  చేస్తున్నారని  ఆయన  బీఆర్ఎస్ తీరుపై మండిపడ్డారు.  లిక్కర్ స్కాంతో  తెలంగాణ సెంటిమెంట్  కు సంబంధం ఏమిటని  ఆయన ప్రశ్నించారు.  భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు  చేస్తున్నారన్నారు.ఢిల్లీ లిక్కర్ స్కాంలో    విచారణను ఎదుర్కోకుండా  తెలంగాణకు  అవమానం  అంటున్నారని ఆయన కవితపై  విమర్శలు  చేశారు.    

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అవినీతి  చేసిన వారు ఎంత పెద్ద వారైనా వారిపై  చర్యలు తీసుకోవాలని  ఆయన  డిమాండ్  చేశారు.  ఈ స్కాంలో కవితపై  అభియోగాలు వచ్చాయన్నారు. దీనికి తెలంగాణ ప్రజలకు ఏం సంబంధమని  ఆయన  అడిగారు.  డిల్లీ లిక్కర్ స్కాంలో దోషులను  ఎవరిని వదిలిపెట్టొద్దని  ఆయన  దర్యాప్తు సంస్థలను  కోరారు. 

also read:వేట కుక్కల మాదిరిగా విపక్షాలపై ఈడీ, సీబీఐ దాడులు: మోడీపై కేటీఆర్ ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు  నిన్న  ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.ఈ నెల  9వ తేదీన  విచారణకు  రావాలని కోరారు. అయితే  ఈ నెల  9వ తేదీన విచారణకు రావడం  వీలు పడదని  కవిత  ఈడీ అధికారులకు  లేఖ రాశారు. ఈ నెల  11న  ఈడీ విచారణకు  రానున్నట్టుగా  కవిత  సమాచారం  ఇచ్చారు.  ఈ నెల  10వ  తేదీన ఢిల్లీలో  జంతర్ మంతర్ వద్ద కవిత దీక్ష  చేయనున్నారు.  మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టాలని  దీక్ష నిర్వహించనున్నారు కవిత.ఈ దీక్షలో  పలు  విపక్ష పార్టీల  ప్రతినిధులు  పాల్గొంటారు. 

ఈ  నెల  6వ తేదీన  ఢిల్లీ లిక్కర్ స్కాంలో  అరుణ్ రామచంద్రపిళ్లైని ఈడీ అధికారులు అరెస్ట్  చేశారు. అరుణ్ రామచంద్ర పిళ్లై రిమాండ్ రిపోర్టులో  కవిత  పేరును ఈడీ అధికారులు ప్రస్తావించారు.  అరుణ్  రామచంద్ర పిళ్లైని  అరెస్ట్  చేసిన  మరునాడే  కవితకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. 

 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios