Asianet News TeluguAsianet News Telugu

మా గొంతునొక్కుతున్నారు: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం

 రాష్ట్ర శాసనసభలో ప్రజాసమస్యలపై  మాట్లాడేందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. 
అధికార పక్షం మా గొంతు నొక్కుతోందన్నారు. మైక్ కట్ చేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పక్ష నియంత వైఖరిని నిరసిస్తూ సభ నుంచి కాంగ్రెస్ శాసనసభా పక్షం వాకౌట్ చేసిందని ఆయన చెప్పారు.

CLP leader Mallu Bhatti Vikramarka fires on TRS government lns
Author
Hyderabad, First Published Mar 17, 2021, 4:42 PM IST

హైదరాబాద్:  రాష్ట్ర శాసనసభలో ప్రజాసమస్యలపై  మాట్లాడేందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. 
అధికార పక్షం మా గొంతు నొక్కుతోందన్నారు. మైక్ కట్ చేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పక్ష నియంత వైఖరిని నిరసిస్తూ సభ నుంచి కాంగ్రెస్ శాసనసభా పక్షం వాకౌట్ చేసిందని ఆయన చెప్పారు.

CLP leader Mallu Bhatti Vikramarka fires on TRS government lns

శాసనసభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సీఎల్పీ ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, పొడెం వీరయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. గన్ పార్క్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ.. ప్రజాసమస్యలపై చర్చించి పరిష్కారం కనుగొనేందుకు మేము చేస్తున్న ప్రయత్నాన్ని ప్రభుత్వం అడ్డుకుంటోందని మండిపడ్డారు.

 ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గొంతునొక్కుతున్నారని బట్టి అన్నారు. అనేక అంశాలను సభ దృష్టికి తీసుకురావాలని కాంగ్రెస్ శాసనసభాపక్షం ప్రయత్నిస్తే.. ప్రభుత్వం అడ్డగోలుగా.. పదేపదే మైక్ కట్ చేయిస్తూ.. మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి లేకుండా కనీసం నిరసన తెలిపేందుకు కూడా మైక్ ఇవ్వకుండా.. అడ్డుకోవడం ఏమిటని భట్టి ప్రశ్నించారు. 

కేవలం మంద బలం ఉంది కదా అని .. మా గొంతు నొక్కుతూ ..ప్రజా స్వామ్యాన్ని ప్రబుత్వం ఖూనీ చేస్తోందని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఉన్న ఏకైక ప్రతిపక్షం కాంగ్రెస్ శాసనసభా పక్షం మాత్రమే..  మాకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా.. ఎటువంటి అప్రజాస్వామిక వ్యాఖ్యలు చేయకపోయినా, సభకు మేము క్షమాపణ చెప్పాలని మంత్రులు చెప్పడం.. మా గొంతు నొక్కడంలోని కుటిల ప్రయత్నమే తప్ప మరేం కాదని భట్టి మండిపడ్డారు.

 ఈ ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచనతో వ్యవహరిస్తూ ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలను అప్రజాస్వామికంగా టీఆర్ఎస్ లో కలుపుకున్నారని అన్నారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండ కూడదని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. 

ప్రభుత్వ వైఖరి అంతిమంగా రాష్ట్ర ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని భట్టి తీవ్రస్థాయిలో చెప్పారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడుకునే భాధ్యత మాపైనా, మీడియాపైనా, ప్రజలపైనా ఉందని భట్టి చెప్పారు. 

దళిత, గిరిజన, రైతుల, నిరుద్యోగ యువతీ యువకుల, ఉద్యోగస్తులు, పెరుగుతున్న నిత్యావసన సరుకుల ధరలు, నిరుద్యోగ సమస్యలపైన .. పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు పైన .. లా అండ్ ఆర్డర్ పైన మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనుకోవడం తప్పా.. అని భట్టి మీడియాను ఉద్దేశించి అడిగారు. సభలో మాట్లాడకుండా మా గొంతు నొక్కడం ప్రభుత్వం దురహంకార పూరిత వైఖరికి నిదర్శనం అని భట్టి విక్రమార్క చెప్పారు. 


నియంత పాలనలో ఉన్నామా? : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
రాష్ట్ర శాససభలో ప్రతిపక్షం గొంతును నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం నొక్కుతోంది. మనం ఉన్నది ప్రజాస్వామ్యంలోనా లేక  నియంత పాలన లోనా అన్న సందేహం వస్తోంది.  ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుక్కొని .. ఇప్పుడు మాకు సభ్యుల సంఖ్యా బలం లేదని చెబుతున్నారు. కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. స్పీకర్ కూడా నిస్పక్ష పాతంగ వ్యవహరించడం లేదు. ప్రజల తరుపున మాట్లాడే అవకాశం ఇవ్వకుండా .. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఉబిలోకి నెడుతున్నారు.  సీమాంధ్ర కాంట్రాక్టర్ల కు రాష్ట్ర సంపదను దొచిపెడుతున్నారు. 

సంఖ్యా బలంతో ప్రతిపక్షాన్ని బుల్డోజ్ చేస్తున్నారు : దుద్దిళ్ల శ్రీధర్ బాబు 
సంఖ్యా బలం ఉంది కదా అని అధికార పార్టీ సభను బుల్డోజ్ చేస్తోంది. ప్రజా సమస్యలను లేవనెత్తితే సభ్యుల గొంతు నొక్కేస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగ్గా లేవు.  నడిరోడ్డుపై అడ్వకేట్ దంపతుల ను హత్య చేశారు.  సభలో దీనిపై మాట్లాడుదాము అనుకుంటే అవకాశం ఇవ్వడం లేదు. స్పీకర్ సభ్యులు అందరిని సమానంగా చూడాలి.  ప్రభుత్వం సభలో మా గొంతు నొక్కుతోంది. హరీష్ రావు ,ప్రశాంత్ రెడ్డిల తీరును ఖండిస్తున్నాం


 

Follow Us:
Download App:
  • android
  • ios