రాష్ట్ర పర్యటనకు  వచ్చిన  సమయంలో  తెలంగాణలో  అవినీతి  జరిగిందని  మోడీ  ప్రకటించారన్నారు. కానీ  ఈ అవినీతిపై  మోడీ  ఎందుకు  చర్యలు తీసుకోలేదని  సీఎల్పీ  నేత  భట్టి విక్రమార్క  ప్రశ్నించారు.

మంచిర్యాల: ఈ నెల 14న మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగగ సభ నిర్వహిస్తున్నట్టుగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. మంగళవారంనాడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. మంచిర్యాలలో నిరవహించే సభలో ఎఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొంటారని ఆయన చెప్పారు. 

తెలంగాణ రాష్ట్రంలో అవినీతి జరిగుగుతుందని ఆరోపణలు చేసిన ప్రధాని మోడీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ఆదిలాబాద్ అభివృద్దిని అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములను కేసీఆర్ సర్కార్ లాక్కొంటుందని ఆయన విమర్శించారు. ప్రధాని మోడీ, కేసీఆర్ లు డ్రామాలాడుతున్నారని ఆయన విమర్శించారు.