కోమటిరెడ్డి ఆ విషయమే చెప్పలేదు, రాజీనామాలకు నేనే ముందుంటా: జానారెడ్డి

CLP leader Jana Reddy reacts on Komatireddy Venkat Reddy comments
Highlights

కోమటిరెడ్డిపై జానా హట్ కామెంట్స్

హైదరాబాద్: ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  చేసిన ఆరోపణలపై సిఎల్పీ నేత జానారెడ్డి తీవ్రంగా స్పందించారు. మూకుమ్మడిగా ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలనే ప్రతిపాదనను తన వద్ద  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీసుకురాలేదని  జానారెడ్డి స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామాల విషయంలో సిఎల్పీ నేత జానారెడ్డి, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డిలు సక్రమంగా వ్యవహరించలేదనే అభిప్రాయాలను  కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి వ్యక్తం చేశారు. ఈ విషయమై జానారెడ్డి తీవ్రంగా స్పందించారు.సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. 

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వాలను రద్దు చేస్తూ గెజిటె నోటిఫికేషన్ వెలువడిన తర్వాత పీసీసీ, సీఎల్పీ నేతలు సరిగా వ్యవహరించలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి ఆరోపణలు చేశారు. ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ ధీటుగా పోరాటం చేయలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన ఆరోపణలను జానారెడ్డి కొట్టిపారేశారు.


మూకుమ్మడి రాజీనామాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆదేశాలు జారీ చేస్తే  రాజీనామాలు చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని జానారెడ్డి స్పష్టం చేశారు.ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దు విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని దీటుగా ఎదుర్కోలేకపోయిందన్న విమర్శలను ప్రతిపక్షనేత కె. జానారెడ్డి కొట్టిపారేశారు. తనతో మూకుమ్మడి రాజీనామా చేద్దామని కోమటిరెడ్డి అననేలేదని, ఒకవేళ అధిష్టానమే గనుక ఆదేశిస్తే అందరికంటే ముందు తానే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

 ‘‘మావాళ్లలోనే కొంతమంది ఒత్తిడితోనో, ఆవేదనతోనో నాయకత్వంపై ఆరోపణలు చేసిఉండొచ్చు. అందుకు ఎవరినీ తప్పుపట్టడంలేదు. సీఎల్పీ తరఫున చట్టబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలేమైనా ఉంటే తప్పకుండా పరిశీలిస్తాం. సభ్యత్వాల రద్దు విషయంలో ఇంకాస్త గట్టిగా ప్రతిస్పందించాల్సి వస్తే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని జానారెడ్డి చెప్పారు.


అధిష్టానం సూచనల మేరకు నడుస్తామని జానారెడ్డి స్పష్టం చేశారు.  మూకుమ్మడి రాజీనామాల అంశమేదీ తమ మధ్య చర్చకు రాలేదని జానారెడ్డి స్పష్టం చేశారు.  ఒకవేళ అధిష్టానమే గనుక ఆ నిర్ణయం తీసుకుంటే తానే ముందుగా  రాజీనామా చేస్తానని జానారెడ్డి ప్రకటించారు.


 కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ ఎత్తివేత తీర్పును సవాలు చేస్తూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంపై జానా హర్షం వ్యక్తం చేశారు. ‘‘మొన్న కర్ణాటకలో, ఇప్పుడు తెలంగాణలో కోర్టులు ఇచ్చిన తీర్పులు  ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింతగా చాటాయన్నారు.  కోర్టు తీర్పును అమలు చేయాలని ఆయన అసెంబ్లీ కార్యదర్శిని కోరారు. లేకపోతే కోర్టు ధిక్కరణ కేసు వేయాల్సి వస్తోందన్నారు.


 

loader