Asianet News TeluguAsianet News Telugu

డయాలిసిస్ రోగులకు బస్‌పాస్ ఇవ్వండి: ప్రభుత్వానికి భట్టి విక్రమార్క విజ్ఞప్తి

హైదరాబాద్‌లోని (hyderabad) ఆసుపత్రుల వద్ద విపరీతమైన రద్దీ కారణంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు జనం ఎండ, వానల్లో పడిగాపులు కాస్తున్నారని.. అలాంటి వారి కోసం షెడ్లు ఏర్పాటు చేయాలని సీఎల్పీ నేత (clp leader) భట్టి విక్రమార్క (bhatti vikramarka) తెలంగాణ ప్రభుత్వాన్ని (telangana govt) కోరారు.

clp leader bhatti vikramarka speech in telangana assembly
Author
Hyderabad, First Published Oct 8, 2021, 2:56 PM IST

హైదరాబాద్‌లోని (hyderabad) ఆసుపత్రుల వద్ద విపరీతమైన రద్దీ కారణంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు జనం ఎండ, వానల్లో పడిగాపులు కాస్తున్నారని.. అలాంటి వారి కోసం షెడ్లు ఏర్పాటు చేయాలని సీఎల్పీ నేత (clp leader) భట్టి విక్రమార్క (bhatti vikramarka) తెలంగాణ ప్రభుత్వాన్ని (telangana govt) కోరారు. అసెంబ్లీ సమావేశాల (telangana assembly sessions) సందర్భంగా ఆయన శుక్రవారం ప్రసంగిస్తూ... దాతలు ఆహారం పంపిణీ చేయడానికి వస్తే దాని కోసం బారులు తీరుతున్నారని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. ఆహారం ఎంతో కష్టపడి తీసుకున్న తర్వాత కూర్చొని తినడానికి స్థలం, మంచినీటి వసతులు సైతం వుండటం లేదని భట్టి తెలిపారు. అన్నపూర్ణ క్యాంటీన్లను ఆసుపత్రుల వద్ద ఏర్పాటు చేస్తే బాగుంటుందని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు.

ALso Read:మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి: తెలంగాణ అసెంబ్లీలో మల్లు భట్టి విక్రమార్క

1978లో కొనేరు రంగారావు (koneru ranga rao) సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా వున్నప్పుడు  భిక్షాటన చేసే వారి కోసం ప్రత్యేకంగా హాస్టల్స్ ఏర్పాటు చేశారిన ఆయన గుర్తుచేశారు. ఈ కార్యక్రమాన్ని తర్వాతి ప్రభుత్వాలు పక్కనబెట్టాయని విక్రమార్క అన్నారు. అన్ని జిల్లాల్లోనూ డయాలసిస్ (kidney dialysis) కార్యక్రమాన్ని ఉచితంగా అందిస్తున్నారని.. అయితే ఆసుపత్రులకు వెళ్లడానికి రవాణా ఖర్చులు పెట్టుకోలేకపోతున్నామని ప్రజలు తమకు చెబుతున్నారని  ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో పేదలకు బస్ పాస్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. సఫాయి కార్మికులకు జీతాలు పెంచాలని కోరారు. నాణ్యమైన విద్య, వైద్యం అందించినప్పుడే నిజమైన సంక్షేమం అమలైనట్లని భట్టి అన్నారు. పల్లె దవాఖాలను (palle dawakhana) వీలైనంత త్వరగా ప్రారంభించాలని విక్రమార్క ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios