Asianet News TeluguAsianet News Telugu

జానారెడ్డిపై తప్పుడు ప్రచారం.. పీసీసీ నియామకం హైకమాండ్‌దే: భట్టి

సీనియర్ నేత జానారెడ్డిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్‌ను బలహీనపరచాలనే కుట్రదారులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని భట్టి ఆరోపించారు.

clp leader bhatti vikramarka slams over fake news against jana reddy ksp
Author
Hyderabad, First Published Dec 5, 2020, 6:01 PM IST

సీనియర్ నేత జానారెడ్డిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్‌ను బలహీనపరచాలనే కుట్రదారులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని భట్టి ఆరోపించారు.

పీసీసీ చీఫ్‌గా ఎవరన్నది నిర్ణయించేది ఏఐసీసీ అని ఆయన తేల్చి చెప్పారు. పార్టీ నాయకులతో కేవలం పార్టీని బతికించడం ఎలా..? అనే దానిపై మాత్రమే చర్చ చేశామని భట్టి పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి అనే అంశాల ద్వారా నిజమైన ప్రజాస్వామ్యానికి స్పూర్తిగా ఉండాలనే ఆలోచనతోనే ఉండేదన్నారు విక్రమార్క.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆశించిన మేర ఫలితాలు రాకపోయినప్పటికీ సైద్ధాంతికంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినట్లుగానే తాము భావిస్తున్నట్లు భట్టి చెప్పారు.

ఓట్లు పొందడం కోసం తాము ఎక్కడా దిగజారలేదని, కాకపోతే ఎన్నికల్లో, ఎణ్నికల ప్రక్రియలో గెలుపొటములను కొలమానంగా తీసుకునే ఈ పరిస్థితుల్లో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఓటమిపైన విశ్లేషణ చేస్తామని విక్రమార్క పేర్కొన్నారు. మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా తాము కూడా లోపాలను సవరించుకుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 146 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలిచింది.ఈ నేపథ్యంలో పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios