మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు ప్రమాదం తృటిలో తప్పింది. ఆయన మేడారం వెళ్లి తిరిగి వస్తుండగా ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనం పస్రా దగ్గర ఆర్టీసి బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శంకర్ నాయక్ ప్రయాణిస్తున్న కారు ముందుభాగంలో ధ్వంసమైంది. కారులో ఉన్న ఎమ్మెల్యే నాయక్ కు కానీ, ఇతరులకు కానీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రమాదం జరిగిన తర్వాత వేరే వాహనంలో ఎమ్మెల్యే అక్కడినుంచి వెళ్లిపోయారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.