నారాయణ పేట జిల్లాలో దారుణం జరిగింది. ఊట్కూర్ మండలం ఎర్గట్‌పల్లిలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.

నారాయణ పేట జిల్లాలో దారుణం జరిగింది. ఊట్కూర్ మండలం ఎర్గట్‌పల్లిలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.

పదో తరగతి చదువుతున్న బాధితురాలి సూసైడ్‌కు పంచాయితీ పెద్దలు రూ.5 లక్షలు వెలకట్టారు. న్యాయం చేపట్టాల్సిన పోలీసులు కూడా పంచాయతీకి సహకరించారు.

దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.