హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా గచ్చిబౌలి గోపన్ పల్లిలో మంగళవారం నాడు బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. 

దీంతో ఉద్రిక్తత చోటు చేసుకొంది. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు పరస్సరం దాడి చేసుకొన్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. టీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచారని ఆరోపించారు.ఈ విషయమై రెండు పార్టీల కార్యకర్తల మధ్య గొడవలు చోటు చేసుకొన్నాయి. 

also read:ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి: కవిత

పోలింగ్ సందర్భంగా ఇరువర్గాలు  గొడవకు దిగారు  కుర్చీలతో ఒకరిపై మరొకరు దాడికి దిగారు.  నగరంలో పలు చోట్ల బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య  గొడవలు చోటు చేసుకొన్నాయి.

మియాపూర్ లో కూడ రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. కూకట్‌పల్లిలో కూడ బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.జీహెచ్ఎంసీ ఎన్నికలను బీజేపీ, టీఆర్ఎస్ లు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ, బల్దియాపై గులాబీ జెండాను రెండోసారి ఎగురవేయాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.