Khammam: తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా టీడీపీ కార్యాలయంలో బుధవారం రెండు వర్గాలు ఘర్షణకు దిగడంతో అంతర్గత కుమ్ములాటలు తెరపైకి వచ్చాయి.
Clash between TDP factions in Khammam: ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం రెండు వర్గాలు ఘర్షణకు దిగడంతో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. ఇద్దరు నాయకులకు చెందిన రెండు వర్గాలు ఘర్షణకు దిగడంతో టీడీపీ అంతర్గత కుమ్ములాటలు తెరపైకి వచ్చాయి.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసన్న, టీడీపీ తెలుగుయువత అధ్యక్షుడు నల్లమల్ల రంజిత్ మద్దతుదారులు పరస్పరం నినాదాలు చేసుకుంటూ ఆందోళనకు దిగారు. అంతకుముందు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తమ నాయకుడి ఫొటోను బ్యానర్ పై ఎందుకు ముద్రించలేదని ఒకరు మరొకరు ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కొద్దిసేపు ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగారు. పోలీసులు జోక్యం చేసుకున్నా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పి.. చివరకు వారిని చెదరగొట్టారు. ఆ తర్వాత టీడీపీ కార్యకర్తలు వేర్వేరుగా నిరసనలు చేపట్టడం గమనార్హం.
