Asianet News TeluguAsianet News Telugu

మక్తల్ టీఆర్ఎస్‌లో ఫ్లెక్సీ వార్... ఎమ్మెల్యే చిట్టెం, వర్కటం వర్గీయుల మధ్య ఘర్షణ

వనపర్తి జిల్లా మక్తల్ టీఆర్ఎస్‌లో ఎమ్మెల్యే చిట్టెం, టీఆర్ఎస్ నేత వర్కటం వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీఆర్ఎస్ నేత వర్కటం వర్గీయులను అడ్డుకున్నారు ఎమ్మెల్యే వర్గీయులు. ఆత్మకూరులో కురుమూర్తిస్వామి ఆభరణాల ఊరేగింపులో ఈ ఘటన చోటు చేసుకుంది.

clash between makthal mla chittem rammohan reddy and varkatam jagannath reddy groups in makthal
Author
First Published Oct 30, 2022, 3:02 PM IST

వనపర్తి జిల్లా మక్తల్ టీఆర్ఎస్‌లో విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే చిట్టెం, టీఆర్ఎస్ నేత వర్కటం వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీఆర్ఎస్ నేత వర్కటం వర్గీయులను అడ్డుకున్నారు ఎమ్మెల్యే వర్గీయులు. ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఆత్మకూరులో కురుమూర్తిస్వామి ఆభరణాల ఊరేగింపులో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

ఇకపోతే... గత కొద్దిరోజులుగా ఉమ్మడి మహబూబ్ నగర్‌ టీఆర్ఎస్‌లో జూపల్లి విషయం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే.  కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్​ రెడ్డి, జూపల్లి కృష్ణారావు వర్గాల మధ్య విభేదాలు చోటుచేసుకుంటున్న సంగతి  తెలిసిందే. ఈ క్రమంలోనే జూపల్లి కొన్ని నెలల క్రితం ఖమ్మం జిల్లాలో పర్యటించడం హాట్ టాపిక్‌గా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అసంతృప్తి నేతలుగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి వెళ్లిన జూపల్లి.. తుమ్మలతో రెండు గంటల పాటు భేటీ అయ్యారు. ఆ తర్వాత ఖమ్మంలోనే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సమావేశమయ్యారు. 

ALso REad:కొందరు ఎస్సైలు నా వాళ్లని వేధిస్తున్నారు.. ఊరుకునేది లేదు, దసరా వరకు డెడ్‌లైన్ : జూపల్లి కృష్ణారావు

ఈ క్రమంలోనే జూపల్లి పార్టీ మారనున్నారనే ప్రచారం సాగుతూ వచ్చింది. ఇటీవల జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీకి కూడా జూపల్లి హాజరు కాకపోవడం.. ఆ వార్తలకు మరింత బలం చేకూర్చింది. అయితే దానిపై స్పందించిన జూపల్లి.. తాను టీఆర్ఎస్‌లోనే ఉన్నానని స్పష్టం చేశారు. అయితే ఆయన పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు. ఇదే సమయంలో జూపల్లిని కలిసిన మంత్రి కేటీఆర్‌ సర్దుకుపోవాలని సూచించినట్లుగా సమాచారం. అయినప్పటికీ కొల్లాపూర్‌లో ఎలాంటి మార్పూ రాలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios