ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మార్కెట్‌లో కమీషన్ దారులు, రైతుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మార్కెట్‌లో కమీషన్ దారులు, రైతుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కమీషన్ దారులపై రైతులు దాడి చేశారు. మరోవైపు రైతులను బంధించేందుకు కమీషన్ దారులు వ్యవసాయ మార్కెట్ గేట్లు మూసివేసేశారు. దీంతో వ్యవసాయ మార్కెట్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 

ఈ పరిణామాలతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి కొనుగోళ్లు నిలిచిపోయాయి. కమిషన్‌ దారులు అమ్మకాలు నిలిపివేసి నిసరనకు దిగారు. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి సంబంధిత అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఇక, గత కొద్ది రోజులుగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు మిర్చి భారీగా వస్తుంది. అయితే ఓ రైతుకు, కమిషన్ దారు మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో ఘర్షణ చెలరేగినట్టుగా తెలుస్తోంది. దీనిపై పూర్తి స్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది.