అక్చరుద్దీన్ ఓవైసీపై హత్యాయత్నం చేసిన నిందితులు ఘర్షణ పడి, ఒకరిపై ఒకరు దాడులకు దిగడంతో ఇద్దరికి గాయాలయ్యాయి.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పాతబస్తీలో గ్యాంగ్ వార్ జరిగింది. ఎమ్మెల్యే అక్చరుద్దీన్ ఓవైసీ పై దాడి చేసిన నిందితులు ఘర్షణ పడ్డారు. నిందితులైన హఫేయి కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో అక్బరుద్దీన్ పై హత్యాయత్నం చేసిన నిందితులు అబ్దుల్లా హఫేయి, హసన్ షాలు గాయపడ్డారు. కత్తులతో దాడులకు తెగబడ్డారు.
విషయం తెలియడంతో.. రంగంలోకి దిగిన చాంద్రాయణగుట్ట పోలీసులు దీనిమీద విచారణ చేస్తున్నారు. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. గ్యాంగ్ వార్ కు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
