Hyderabad: రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్‌ఎస్‌ఎస్) విద్యార్థి విభాగం, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ), వామపక్ష విద్యార్థి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) విద్యార్థుల మ‌ధ్య‌ ఘ‌ర్ష‌ణ చోటుచేసుకుంది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్ సీయూ) లో విద్యార్థి సంఘం ఎన్నికల క్ర‌మంలో ఈ ఘ‌ర్ష‌ణ‌లు చోటుచేసుకున్నాయి.  

ABVP, SFI Students Clash At Hyderabad (HCU): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘం ఎన్నికల విష‌యంలో ఏబీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు ఘర్షణ ప‌డ్డారు. ఏబీవీపీకి చెందిన గిరిజన విద్యార్థులపై ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు హింసకు పాల్పడ్డారని, పదునైన వస్తువులతో దాడి చేశారని ఏబీవీపీ ఆరోపించింది.

వివ‌రాల్లోకెళ్తే.. రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్‌ఎస్‌ఎస్) విద్యార్థి విభాగం, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ), వామపక్ష విద్యార్థి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) విద్యార్థుల మ‌ధ్య‌ ఘ‌ర్ష‌ణ చోటుచేసుకుంది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్ సీయూ) లో విద్యార్థి సంఘం ఎన్నికల క్ర‌మంలో ఈ ఘ‌ర్ష‌ణ‌లు చోటుచేసుకున్నాయి. ఏబీవీపీ పోస్టర్లను చించి వేస్తుండగా ప్రశ్నించిన విద్యార్థులపై ఎస్ఎఫ్ఐ విద్యార్థులు దాడిచేసిన‌ట్టు ఆరోపించారు. శుక్ర‌వారం రాత్రి ఎలక్షన్ ముగిసిన తర్వాత ఒంటి గంటకి ఏబీవీపీ పోస్టర్లును కేరళ కి చెందిన ఎస్ఎఫ్ఐ విద్యార్థి చించి వేస్తుండగా ప్రశ్నించిన రాజేందర్ నాయక్, సిద్దం శుక్ల, ఆకాశ్ బాటి అనే ఏబీవీపీ విద్యార్థుల పై ఎస్ఎఫ్ఐ విద్యార్థులు దాడికి పాల్ప‌డ్డార‌ని స‌మాచారం. 

హాస్టల్లో వాటర్ పట్టుకుంటుండగా ఏబీవీపీ పోస్టర్లను చించ్చుతుండగా ప్రశ్నించిన రాజేందర్ నాయక్ పై ఎస్ఎఫ్ఐ విద్యార్థులు దాడికి పాల్ప‌డ్డార‌ని సంబంధిత విద్యార్థులు ఆరోపించారు. దీంతో ఆగకుండా అక్కడే ఉన్న అద్దం పగలగొట్టి, దాడితో దాడి చేశార‌ని ఆరోపించారు. తీవ్ర గాయాల పాలైన రాజేందర్ నాయక్ సిద్దాం శుక్ల, ఆకాశ బాటి అనే ఏబీవీపీ విద్యార్థులను గచ్చిబౌలిలోని ఆసుపత్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం వారు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. 

క్యాంప‌స్ లో విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి దాడులు చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌లు కిటికీల అద్దాలు దెబ్బ‌తిన్నాయి. ఫ‌ర్నిచ‌ర్ ధ్వంస‌మైంది. ఒక విద్యార్థి తీవ్రంగా గాయపడగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామ‌ని క్యాంప‌స్ వ‌ర్గాలు తెలిపాయి. మొద‌ట ఇద్దరు విద్యార్థులు మ‌ధ్య మాటల యుద్ధంతో చివ‌ర‌కు తీవ్ర ఘ‌ర్ష‌ణ కు దారితీసింది. స‌మాచారం అందుకున్న అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. 200 మంది పోలీసు సిబ్బంది, ఎనిమిది మంది సీఐలు అక్క‌డ శాంతి భ‌ద్ర‌త‌ల చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని స‌మాచారం. 

ఈ దాడి ఘటనపై యూనివర్సిటీ సెక్యూరిటీ అధికారులకు ఏబీవీపీ విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ఇక ఎస్ఎఫ్ఐ విద్యార్థులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఏబీవీపీ విద్యార్థుల‌పై ఫిర్యాదు చేశారు. కాగా, క్యాంపస్ లో శుక్రవారం విద్యార్థి సంఘం ఎన్నికలు జరిగాయి. రెండేళ్ల విరామం తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. 

అంతకుముందు ప్రధాని మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ప్రదర్శనపై ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఘర్షణకు దిగారు. ఎస్ఎఫ్ఐ ఈ సినిమాను ప్రదర్శించాలని కోరగా, ఏబీవీపీ నిరసన వ్యక్తం చేసింది. అయితే ఈ డాక్యుమెంటరీని ఎస్ఎఫ్ఐ సభ్యులు ప్రదర్శించగా, క్యాంపస్ ఏబీవీపీ 'ది కశ్మీర్ ఫైల్స్'ను ప్రదర్శించింది. 2014లో బహుజన స్టూడెంట్స్ ఫ్రంట్, ఎస్ఎఫ్ఐ అనే రెండు విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణలో ఎనిమిది మంది విద్యార్థులు గాయపడ్డారు. యూనియన్ కౌన్సిల్ సమావేశాన్ని పిలవడంతో ఘర్షణ చెలరేగింది. సర్క్యులర్ ద్వారా తమకు సమాచారం ఇవ్వకపోవడంతో బీఎస్ఎఫ్ సమావేశానికి గైర్హాజరైంది. అయినప్పటికీ ఎస్ఎఫ్ఐ సమావేశం కొనసాగించింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.